చిన్న తప్పులే భారీ మూల్యాలకు దారి తీస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా ఏపీలో చోటు చేసుకున్న తాజా పరిణామంగా చెప్పొచ్చు. కొన్నిసార్లు తప్పుల్ని క్షమిస్తుంటారు. కానీ.. కొన్ని తప్పుల విషయంలో మినహాయింపు అన్నది ఉండదు. ఏపీలో చోటు చేసుకున్నది ఇదే కోవకు వస్తుంది. ఏపీ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటిన నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రం ముక్కలైపోయిన జూన్ 2నే నిర్వహించటం పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. అదేమంటే దీక్ష దినంగా ఆయన చెబుతూ.. చిత్రమైన వాదనను వినిపించేవారు. ఎంత తలలో గుజ్జు లేనోడైనా.. రాష్ట్రం ముక్కలైపోయిన రోజును రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించటానికి ససేమిరా అంటారు. కానీ.. బాబు మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా లాజిక్ కు ఏ మాత్రం అందని రీతిలో వాదనలు వినిపించేవారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబు ఘోర ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటిన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ రోజున (శుక్రవారం) విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకల్ని నిర్వహించనుంది.
దీని కోసం ఏపీ టూరిజం.. సాంస్కృతిక శాఖ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇది కాస్తా ఇప్పుడు వివాదమైంది. దీన్ని చూసినోళ్లంతా నోరెళ్లబెట్టటమే కాదు.. ఇలా చేశారేమిటంటూ బుగ్గలు నొక్కుకునే పరిస్థితి. మద్రాసు నుంచి విడిపోయి సొంతంగా రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవటంలో కీలకమైన అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాన్ని మిస్ కావటమే దీనికి కారణం.
ఏపీ టూరిజం.. సాంస్కృతిక శాఖ విడుదల చేసిన ప్రచార చిత్రంలో జాతిపిత మహాత్మాగాంధీ.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రాలతో పాటు.. శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాముల్ని మర్చిపోవటం ఏమిటన్న ఆగ్రహాం వ్యక్తమవుతోంది.
ఆహ్వాన పత్రికలోనే కాదు.. ఆవతరణ దినోత్సవం వేడుకలకు సంబంధించిన పాంప్లేట్.. స్వాగత తోరణాల దగ్గర పొట్టి శ్రీరాముల పేరు కానీ.. ఫోటో కానీ కనిపించని పరిస్థితి. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించేలా చేసిన వారెవరు? ఎందుకిలా చేశారు? ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికే ఇలాంటి పనులు చేశారా? అన్న కోణాల్లో విచారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద స్పందించి వివరణ ఇవ్వటం మంచిదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్రం కోసం తన ఆత్మబలిదానానికి సైతం వెనుకాడని వ్యక్తిని మర్చిపోవటానికి మించిన ఘోర తప్పిదం మరింకేం ఉంటుంది?