ఒక భయం విలువ ఎంత? అన్న ప్రశ్నను ఎవరికైనా వేస్తే వెంటనే సమాధానం చెప్పలేరు. కానీ.. ఇదే ప్రశ్నను ఫ్రౌల్టీ రంగానికి చెందిన ప్రముఖుల్ని అడిగితే.. రూ.27వేల కోట్లు అన్న మాటను చప్పున చెప్పేస్తారు. కంటికి కనిపించని మాయదారి పిశాచి వైరస్ పుణ్యమా అని చైనానే కాదు.. ప్రపంచం మొత్తం ప్రభావితం అవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి? మరెలా కంట్రోల్ చేయాలో అర్థం కాక కిందామీదా పడిపోతున్న పరిస్థితి.
కొవిడ్ వైరస్ కు కోళ్ల పరిశ్రమకు ఎలాంటి లింకు లేకున్నా.. అసత్య ప్రచారంతో పాటు.. అనవసరమైన భయం ఇప్పుడు కోడిని నమ్ముకున్న ఫ్రౌల్టీ పరిశ్రమ కు కొత్త కష్టాన్ని తెచ్చి పెడుతోంది. దేశ వ్యాప్తంగా లక్ష కోట్ల మేర టర్నోవర్ ఉండే ఈ పరిశ్రమ గడిచిన నెల వ్యవధిలో దేశ వ్యాప్తంగా కొవిడ్ వైరస్ ప్రచారంతో భారీ నష్టాన్ని నమోదు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.
ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే మొదటికే మోసం రావటమే కాదు.. భారీ నష్టం వాటిల్లటం ఖాయం. కొవిడ్ వైరస్ భయంతో చికెన్ తో పాటు.. కోడికి సంబంధించిన మాంసాహారాన్ని తినటాన్ని పలువురు తగ్గించేశారు. దీంతో డిమాండ్ తగ్గిపోయి.. ధర పడిపోయింది. దీంతో.. పెంచుతున్న కోట్లాది కోళ్లను ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇదిప్పుడు మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
కోడి గుడ్డును తింటే కోవిడ్ వైరస్ బారిన పడతారంటూ సోషల్ మీడియా లో సాగుతున్న అసత్య ప్రచారంతో గుడ్లతో పాటు కోడి ఉత్పత్తుల్ని ఎవరూ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో.. మార్కెట్లో కోడికి మాండ్ పడిపోయింది. ఈ పరిశ్రమను నమ్ముకున్న ఇతర పరిశ్రమలు కూడా ప్రభావితమవుతున్నాయి. లక్షలాది కోళ్లు సమయానికి మార్కెట్ కు వెళ్లకపోవటంతో ఫారాల్లోనే మరణిస్తున్నాయి. వీటిని గుట్టుచప్పుడు కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. కోవిడ్ వైరస్ భయంలో కోడి వ్యాపారంలో కొత్త కలకలానికి కారణమైంది.