ఈమద్య కాలంలో కరెంటు బిల్లులు చూసి జనాలు కళ్లు తిరిగి పడిపోతున్నారు. చిన్న చిన్న ఇళ్లకు కూడా వేలు లక్షల్లో కరెంటు బిల్లు వస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఒక ప్రభుత్వ స్కూల్ కు లక్షల్లో కరెంటు బిల్లు వచ్చిన విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో కూడా జరిగింది. పెద్దపల్లి జిల్లాలో కరెంటు బిల్లు సామాన్యుడికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సంజయ్ నగర్ కు చెందిన మాస రాజయ్య అనే వ్యక్తికి రెండు రూంల రేకుల ఇల్లు ఉంది. దానికి చాలా ఏళ్లుగా విద్యుత్ వాడుతున్నాడు. అందుకు గాను ఒక మీటర్ ను కూడా బిగించుకుని ఉన్నాడు. మీటరు పాతబడటం వల్ల సాంకేతిక లోపం వచ్చినట్లుంది. దాంతో రీడింగ్ భారీ మొత్తంలో తిరిగింది. రెండు నెలలకు గాను ఏకంగా 6,08717 రూపాయల బిల్లు వచ్చింది.
బిల్లు చూసి బిత్తరపోయిన రాజయ్య విద్యుత్ అధికారుల వద్దకు పరుగు పెట్టాడు. ఆ బిల్లును చూసి విద్యుత్ అధికారులు కూడా విస్తు పోయారు. సాంకేతిక సమస్య కారణంగా ఇంత బిల్లు వచ్చిందని మీటరు మారుస్తామని గత నెల వచ్చినంత బిల్లును మీరు ఈ నెలలో కట్టాల్సిందిగా సూచించారట. దాంతో కాస్త ఊరట చెందిన రాజయ్య మీటరు మార్పించుకునే పనిలో పడ్డాడు.