తమ అవసరాలకు తగినంత విద్యుత్తు ఇవ్వకుండా ఏపీ సర్కారు తమను తెగ ఇబ్బంది పెడుతోందంటూ తెలంగాణ అధికారపక్షం నేతలు తరచూ విరుచుకుపడటం తెలిసిందే. తమ రాష్ట్ర ప్రజలు పడుతున్న కరెంటు వెతలు తెలియజేయాలనుకున్నారేమో కానీ.. హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌లో కరెంటు కోతలు ఏ రేంజ్‌లో ఉంటాయో చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని చాలాప్రాంతాల్లో కరెంటు కోతలన్నవి ఇప్పటివరకూ లేవు. కానీ.. అందుకు భిన్నంగా సెక్రటేరియట్‌లోని ఏపీ సీఎం ఉండే ఎల్ బ్లాక్‌లో మాత్రం కంరెటు తరచూ కట్ అవుతోంది.
దీనికి కారణంపై ఎవరూ నోరు మెదపటం లేదు. సోమవారం సంగతే తీసుకుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటనలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఏపీ సెక్రటేరియట్‌లోని ఆయన ఉండే ఎల్ బ్లాక్‌లో ఈ రోజు పలుమార్లు పవర్ సప్లై ఆగిపోయింది. దీంతో.. సచివాలయసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఎల్ బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంత్రి శిద్దా రాఘవరావు పేషీలో కరెంటు పలుమార్లు పోయింది. ఈ సందర్భంగా సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇలా ఏపీ సచివాలయంలో విద్యుత్తు తరచూ పోవటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి.. ఈ పవర్‌కటింగ్‌ల వెనుక అసలు విషయం ఏమిటన్న దానిపై అయోమయం నెలకొంది. మిగిలిన బ్లాక్‌ల సంగతి పక్కన పెడితే ఎల్‌బ్లాక్‌లో పదే పదే కరెంటు పోవటం ఎందుకో..?