పవర్ పాయింట్ : శుభవార్త చెప్పిండు పెద్దిరెడ్డి

Update: 2022-04-25 04:33 GMT
ఇతర రాష్ట్రాలు వేరు మ‌న రాష్ట్రం వేరు. పీక్ అవ‌ర్స్ లో తెలంగాణ స‌ర్కారు కొన‌గ‌లిగినంత కూడా ఆంధ్రా స‌ర్కారు కొనుగోలు చేయ‌డం లేదు అన్న‌ది ఎప్పుడో తేలిపోయింది. యూనిట్ రేటును త‌క్కువ‌కు కోట్ చేసి బిడ్డింగ్ నుంచి తెలివిగా త‌ప్పుకుంటోంది అన్న ఆరోప‌ణ‌లు కూడా గ‌తంలో వెలుగు చూశాయి. వీటి ఆధారాలు కూడా వ‌చ్చాయి. అయినా కూడా పెద్దిరెడ్డి ఇవాళ కొన్ని మాట‌లు చెప్పారు. ఇవ‌న్నీ చూస్తే కొర‌త నివార‌ణ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని, వాటి ఫ‌లితాలు త్వ‌ర‌లోనే  వెల్ల‌డిలోకి వ‌స్తాయ‌ని ఓ చిన్న ఆశ క‌లుగుతోంది.

ఆ విధంగా పెద్దిరెడ్డి మ‌రోసారి బొగ్గు కొర‌త నివార‌ణ‌కు. బ‌హిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలుకు తామేం చేయ‌నున్నామో చెప్పారు. కానీ ఇందుకు సంబంధించి నిధుల కేటాయింపు ఎలా చేస్తార‌న్న‌ది మాత్రం చెప్ప‌క‌పోవ‌డం విచార‌క‌రం.

అంటే కేవ‌లం ఇదొక ప్ర‌క‌ట‌న అని ఆశించాలా లేదా నిధులు లేవ‌ని చెప్ప‌డం ఇష్టం లేద‌ని భావించాలా లేదా నిధుల విడుద‌ల ఆల్రెడీ చేసేసి ఇప్పుడు ఫ‌లితాల కోసం నిరీక్షిస్తున్నారా అన్న సందేహాలూ లేక‌పోలేదు.ఏదేమ‌యినా పెద్దాయ‌న పెద్దిరెడ్డి చెప్పారు క‌నుక త్వ‌ర‌లోనే కోత‌ల కాలం పోనుంది.. అని నిర్ణ‌యించుకోవ‌డం ఇప్ప‌టి విధి.

దేశ వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య ఇది.. ర‌ష్యా - ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కార‌ణంగా బొగ్గు దిగుమ‌తులు లేవు. దీని కార‌ణంగానే స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి అని చెబుతున్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి. గతంతో పోలిస్తే ఇప్పుడు ప‌రిస్థితుల‌ను మెరుగు ప‌ర్చేందుకు ఒక కోర్ మేనేజ్మెంట్ టీం ను ఏర్పాటు చేశామ‌ని అంటున్నారు. మ‌రి! వీటి ఫ‌లితం ఎలా ఉండ‌నుందో ..అన్న‌ది కొద్ది రోజులు ఆగితేనే తేలుతుంది మ‌రియు తెలుస్తుంది.

ఆంధ్రావ‌ని వాకిట విద్యుత్ స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి. బొగ్గు కొర‌త ప్ర‌భావం సంబంధిత థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌పై తీవ్రంగా ఉంటోంది. కీల‌క స‌మ‌యంలో ఎంతో రిస్క్ ఫేస్ చేసి ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ ఆఫ్  ప్ర‌క‌టించినా కూడా స‌మ‌స్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. గ్రామాల‌లో విద్యుత్ కోత‌ల‌కు వేళాపాళా లేద‌ని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. రోజుకు ఎనిమిది గంట‌ల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయ‌ని వీరంతా వాపోతున్నారు.

ఈ స‌మ‌యంలో పంట‌ల‌పై కోత‌ల ప్ర‌భావం ప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.ఎట్ట‌కేల‌కు అప్ర‌మ‌త్త‌మైంది. ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి సంబంధిత అధికారుల‌తో  టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి స‌మ‌స్య ప‌రిష్కారానికి కొన్ని సూచ‌న‌లు చేసి ఆంధ్రావాసుల‌కు శుభవార్త చెప్పారు. మే మొద‌టి వారం నుంచి కోత‌ల నివార‌ణ సాధ్యం అవుతుంద‌ని కొర‌త నివార‌ణ కూడా సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News