క‌మ‌ల్‌ కు అండ‌గా నిలిచిన ప్ర‌కాశ్ రాజ్‌

Update: 2017-11-03 17:23 GMT
హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించాల్సిందేనని సంచ‌ల‌న కామెంట్లు చేసిన సినీ న‌టుడు - కాబోయే రాజ‌కీయ‌వేత్త‌(!) క‌మ‌ల్ హ‌స‌న్‌ పై బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో కేసులు కూడా న‌మోదు అవుతున్నాయి. అయితే ఈ క‌ల‌కలంలో మ‌రో కొత్త ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది.అనూహ్య రీతిలో కమల్‌ కు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మద్దతు తెలిపారు. సూటిగా పలు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ...అస‌లు ఏది ఉగ్ర‌వాదం - తీవ్ర‌వాదం అంటూ నిల‌దీశాడు. త‌ద్వారా ప‌రోక్షంగా క‌మల్ కామెంట్ల‌కు సంఘీభావం తెలిపాడు.

‘జస్ట్ ఆస్కింగ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో ఇటీవ‌ల ప‌లు అంశాల‌పై స్పందిస్తున్న ప్ర‌కాశ్ రాజ్ తాజాగా ఈ వివాదంపై కూడా స్పందించారు. ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గోవధ చేశారనే చిన్న అనుమానంతో శిక్షించడం తీవ్రవాదం కాదు. నైతికత పేరుతో దేశంలోని ఓ జంటను వేధించి - శారీరకంగా చిత్రహింసకు గురి చేయడం తీవ్రవాదం కాదు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన వారిని విమర్శించడం, తిట్టిపోయడం తీవ్రవాదం కాదు.. మరి తీవ్రవాదం అంటే ఏంటి’ అని ప్ర‌కాశ్ రాజ్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు. ‘జాతి - మతం - నైతికత పేరుతో భయపెడితే తీవ్రవాదం కాదు. మరి దాన్ని ఏమంటారు?.. కేవలం అడుగుతున్నాను’ అని ప్రకాష్ రాజ్‌ ట్వీట్‌ చేశారు.

మ‌రోవైపు హిందు ఉగ్రవాదం పెరిగిపోతున్నదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఐపీసీ సెక్షన్ 500 - 511 - 298. 295(ఏ) - 505(సీ) కింద కేసు బుక్ చేశారు. కమల్ మరో హఫీజ్ సయీద్.. అతనివి చిల్లర రాజకీయాలని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు మండిప‌డ్డారు. ``గ‌తంలో కాంగ్రెస్ నేతలు చిదంబరం - సుశీల్‌ కుమార్ షిండే ముస్లిం ఓట్ల కోసం దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని పార్లమెంట్‌ లోనే చెప్పారు. ఇప్పుడు కమల్‌ హాసన్ అలాంటి కామెంట్సే చేశాడు. ఈ వ్యాఖ్యలతో అతడు చిదంబరం - హఫీజ్ సయీద్ సరసన నిలుస్తున్నాడు.ఇలాంటి చిల్లర రాజకీయాలను తమిళ ప్రజలు తిప్పికొడతారు `అని నరసింహారావు స్పష్టంచేశారు.
Tags:    

Similar News