మేధావి ప్ర‌కాశ్ రాజ్ లో క‌మ్యునిస్ట్ నిద్ర లేచాడుగా?

Update: 2018-11-07 05:53 GMT
ఎడ్డెం అంటే తెడ్డెం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం కామ్రేడ్స్ కు అల‌వాటే. దేశంలో మ‌రే వ‌ర్గానికి లేనంత అభిమానం.. త‌మ దారిన న‌డిచే వారిని అమాంతం నెత్తిన పెట్టుకోవ‌టం కామ్రేడ్స్ కు.. లెఫ్ట్ ఓరియంటేష‌న్ ఉన్న వారికి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. వారిని వారు ప్ర‌మోట్ చేయ‌ట‌మే కాదు.. వారి వ‌ర్గాన్ని నిత్యం ప్రొటెక్ట్ చేసుకోవ‌టానికి వారు ప‌డే శ్ర‌మ చూస్తే.. క‌మ్యూనిస్టులు అనేటోళ్లు ప్ర‌త్యేక‌మైన జాతిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

వారికి.. కులాలు.. మ‌తాలు.. ప్రాంతాలు.. ఇలాంటివేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు క‌మ్యునిస్ట్ చైనా వ‌ర్సెస్ భార‌త్ అన్న విష‌యంలోనూ వారు చైనా క‌మ్యూనిస్ట్ వాద‌న‌ల‌కు ఒకింత మొగ్గిన‌ట్లుగా క‌నిపిస్తుంటారు.

ఈ కార‌ణంతోనే డెబ్బైల‌లో క‌మ్యూనిస్ట్‌ ల‌ను ఉద్దేశించి కొంద‌రు ఎట‌కారంగా చైనావోడికి జ‌లుబు చేస్తే.. భార‌త్ లోని క‌మ్యునిస్టుల‌కు ప‌డిసం ప‌డుతుంద‌ని.. తుమ్ములు వ‌స్తాయ‌న్న మాట వినిపించేది. సెంటిమెంట్లు.. మ‌నోభావాల్ని అస్స‌లు ప‌ట్టించుకోని కామ్రేడ్స్.. మెజార్టీ ప్ర‌జ‌ల మాట‌కు భిన్నంగా మాట్లాడ‌టం మొద‌ట్నించి అల‌వాటు.

ఇదే అంశం భార‌త్‌ లోని క‌మ్యునిస్టుల ప్రాభ‌వం కొడిగ‌ట్ట‌టానికి కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యానికి మ‌హిళ‌ల్ని అనుమ‌తించే విష‌యంలో సుప్రీం తీర్పున‌కు భిన్నంగా కోట్లాది మంది నిర‌స‌న తెలుపుతున్న వేళ‌.. ప్ర‌ముఖ సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ లోని కామ్రేడ్ నిద్ర లేచారు.తాజాగా ఈ అంశంపై ఆయ‌న కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

అయ్య‌ప్ప ద‌ర్శ‌నంపై సుప్రీం తీర్పును సైతం కోట్లాది మంది భ‌క్తులు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తున్న వేళ‌.. వామ‌ప‌క్ష వాది అయిన ప్రకాష్ రాజ్.. స్త్రీ అంటే తల్లి.. మ‌నం పుడిమిని త‌ల్లితో పోలుస్తాం. మ‌న‌కు జ‌న్మ‌నిచ్చేదీ మ‌హిళే. అదే మ‌హిళ‌ను పూజ‌ల‌కు దూరంగా ఉంచ‌టంలో అర్థం ఏమిటి? మ‌హిళ‌ల‌ను ప్రార్థించ‌టానికి అనుమ‌తించ‌ని మ‌తం నా దృష్టిలో మ‌త‌మే కాదు. దైవ‌ద‌ర్శ‌నానికి అతివ‌ల‌ను అనుమ‌తించ‌ని భ‌క్తులు భ‌క్తులే కాదు.. త‌న స‌న్నిధికి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించ‌ని అయ్య‌ప్ప దేవుడే కాడంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయ్యా.. కామ్రేడ్ ప్ర‌కాశ్ రాజ్ గారు.. మీదైన ఫ్లోలో నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం కాదు. కొన్ని నిజాల్ని గుర్తించ‌న‌ట్లుగా మాట్లాడితే అది స‌రైన వాద‌న అనిపించుకోదు.

1. అయ్య‌ప్ప‌ద‌ర్శ‌నానికి సంబంధించి అక్క‌డి క్షేత్ర ఆచారం ప్ర‌కారం శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మాత్ర‌మే అనుమ‌తించ‌రు త‌ప్పించి అన్నిచోట్ల కాదు. అయ్య‌ప్ప‌ను ఆరాధించ‌ట‌మే ల‌క్ష్య‌మైన‌ప్పుడు ఊళ్లో ఉన్న ఆల‌యాలు స‌రిపోవా?  శ‌బ‌రిమ‌ల‌కే రావాలా?

2. ఎవ‌రి మీద‌నైనా న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు.. వారిని అమితంగా ప్రేమించిన‌ప్పుడు.. వారు కోరుకున్న‌ట్లుగా ఉండ‌టం స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. అలాంట‌ప్పుడు శ‌బ‌రిమ‌ల ఆల‌య ద‌ర్శ‌న నిబంధ‌న‌ల‌కు సంబంధించి మ‌హిళ‌ల్ని అస్స‌లు రానివ్వ‌ర‌న్న‌ది లేదు. కొన్ని వ‌య‌స్కుల వారికి మాత్ర‌మే ప‌రిమితులు.

3. కొన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని త‌ప్పించి.. మిగిలిన మ‌హిళ‌లంతా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను సంద‌ర్శించుకునే వీలు ఉంద‌న్న వాస్త‌వాన్ని ఎందుకు మ‌రుస్తున్నారు. ఆ విష‌యాన్ని గుర్తించ‌కుండా ఎందుకు మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు?

4. శ‌బ‌రిమ‌ల‌ను ద‌ర్శించే భ‌క్తుల్లో ఎక్కువ మంది మండ‌లం పాటు క‌ఠిన దీక్ష‌ చేసి కొండ‌కు వ‌చ్చే వారే.  వారు స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే వేళ‌లో ప‌విత్ర‌మైన ఇరుముడిలో ఇంట్లోని మ‌హిళ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో  కొబ్బ‌రికాయ‌ల్లో ఆవునెయ్యి నింపుతార‌న్న విష‌యం ప్ర‌కాశ్ రాజ్‌ కు తెలుసా?

5. అయ్య‌ప్ప‌ను ఆరాధించేవారు.. ఆయ‌న్ను న‌మ్మేవారు.. క్షేత్ర ధ‌ర్మాన్ని పాటిస్తారు. దాన్ని అంగీక‌రించ‌ని వారు అయ్య‌ప్ప భ‌క్తులు ఎలా అవుతారు?

6. సంచ‌ల‌నాల‌ కోసం.. వివాదాన్ని అంత‌కంత‌కూ పెంచే అయ్య‌ప్ప ద‌ర్శ‌నాన్ని వాడేస్తున్న వారిని నిజ‌మైన భ‌క్తులా? 
Tags:    

Similar News