బీజేపీకి బాగా పట్టున్న బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తానంటూ తొడగొట్టాడు ప్రకాశ్ రాజ్. గత రెండు పర్యాయాలు ఇక్కడ బీజేపీ అభ్యర్థే ఎంపీగా ఉన్నారు. రాష్ట్ర రాజధానిలో కీలక స్థానం నుంచి గెలుపు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టిన ప్రకాశ్ రాజ్.. లోక్‌సభ ఎన్నికల నోటిపికేషన్ రాకముందే తన ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ఇంటింటికి తిరుగుతూ తాను ఎందుకు నిలబడాల్సి వచ్చిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు.
బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. అన్నింటికి మించి ఎక్కువుగా ఉత్తరాది లేదా ఏపీ నుంచి వచ్చినవాళ్లు ఉంటారు. దీంతో.. ఇక్కడ జనాభా చాలా ఉంటుంది కానీ ఓట్లు మాత్రం చాలా తక్కువుగా ఉంటాయి. ప్రతీసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఈ నియోజకవర్గంలో బాగా తగ్గుతుంది. సో.. ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్లని ప్రభావితం చేయగలిగితే చాలు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్.. తన ప్రచారం షురూ చేశాడు. బెంగళూరు సెంట్రల్ అంటే చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటినుంచి మొదలుపెడితే తప్ప ప్రతీ ఒక్కరికీ రీచ్ అవ్వలేననే విషయం ఈ విలక్షణ నటుడికి తెలుసు. అందుగానే కాస్త ముందుగానే తొండరపడ్డాడు.
Full View