ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యానంతరం.....అవకాశం దొరికిపుడల్లా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్....ప్రధాని మోదీపై, బీజేపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాశ్ రాజ్....సోషల్ మీడియాలో బీజేపీపై ఓ మినీ యుద్ధమే చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతలనుంచి తీవ్ర ప్రతివిమర్శలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూర్ లో జరిగిన ప్రధాని మోదీ ర్యాలీపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
వామపక్ష భావాలు ఎక్కువగా ఉన్న ప్రకాశ్ రాజ్....బీజేపీపై విరుచుకుపడడం కాంగ్రెస్ కు కూడా లాభిస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో ప్రకాశ్ రాజ్ కు మంచి పట్టు ఉంది. దీంతో, ప్రకాశ్‌రాజ్ ను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని సాహితీవేత్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ రాజ్ కు రాజ్యసభ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని సిద్ధరామయ్యకు వారు విజ్ఞప్తి చేశారు. బీజేపీ - మోదీలకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రకాశ్ రాజ్ తన గళాన్ని గట్టిగా వినిపిస్తారని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కు టికెట్ ఇచ్చే అంశంపై ఏఐసీసీతో కూడా సిద్ధూ చర్చించినట్లు తెలుస్తోంది. సాధారణ పౌరుడిగా - సెలబ్రిటీ హోదాలోనే బీజేపీపై ఈ స్థాయిలో విరుచుకుపడుతున్న ప్రకాశ్ రాజ్...పెద్దల సభకు వెళితే....మరింత రెచ్చిపోయే అవకాశముందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ - సిద్ధరామయ్యలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.