రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శుభ్రా ముఖర్జీ ఉదయం తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ముఖర్జీని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. సతీమణి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోనే ఉంటు తప్పనిసరి అయిన అధికారిక కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.