రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య వ్యవహారంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. వారిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు విస్మయకరంగా మారాయి.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన అభిమతానికి భిన్నంగా తమ కంటే తక్కువ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అతడ్ని చంపించిన మారుతిరావు తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే తాను చేసిన పని పట్ల మారుతీరావులో కించిత్ పశ్చాతాపం కనిపించటం లేదని ఆయన హావభావాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో నిందితుల వరుసలో నిలుచోవాల్సి రావటం తప్పుగా ఆయన ఫీల్ కావట్లేదన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉందంటున్నారు.
ఓ పక్క మీడియా సమావేశం జరుగుతుంటే.. మరోవైపు రెండు చేతుల్ని ఫ్యాంటు జేబుల్లో పెట్టుకొని దిలాసాగా కనిపించిన తీరు విస్మయకరంగా మారింది. ఈ తీరు అరెస్ట్ చేసినప్పుడు.. పోలీసుల విచారణ సమయంలోనూ ఇలానే వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. ప్రణయ్.. అమృతల్ని వేరు చేయాలన్న తన లక్ష్యం నెరవేరిందన్న భావన అతనిలో ఉన్నట్లుగా పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తన కుమార్తె ఇష్టపడిన కుర్రాడిని చంపించిన వైనంలో ఎలాంటి బాధ తనలో లేదని.. ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదన్న భావన వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. విలేకరుల సమావేశం జరుగుతుంటే.. జట్టు సరి చేసుకోవటం.. మిగిలిన నిందితుల మాదిరి ముఖం కనిపించకుండా కవర్ చేసుకోవటం లాంటివేమీ కనిపించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రణయ్ హత్యకు కలిసి కుట్ర పన్నిన మారుతీరావు.. అతని సోదరుడు శ్రవణ్ లు గడిచిన నాలుగు రోజుల్లో ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోవటం.. ఎవరికి వారుగా ఉండటం పోలీసు అధికారులు సైతం విస్మయానికి గురి చేస్తోంది. కలిసి కట్టుగా హత్య చేసినా.. ఎవరికి వారుగా ఉండటం ఏమిటన్నది అర్థం కానిదిగా మారిందన్న మాట పోలీసులు అధికారులు చెబుతున్నారు.