ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు ఆ వీడియోనే కార‌ణ‌మా?

Update: 2018-09-15 11:26 GMT
మిర్యాల‌గూడ‌లో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప్ర‌ణ‌య్ పరువు హ‌త్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. త‌న కుమార్తె అమృత‌....ప్ర‌ణ‌య్ ను కులాంత‌ర వివాహం చేసుకుంద‌న్న క‌క్ష‌తో ఆమె తండ్రి మారుతీరావు ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. గ‌త రెండు నెల‌ల నుంచి ప్ర‌ణ‌య్ క‌ద‌లిక‌ల‌పై రెక్కీ నిర్వ‌హించి మ‌రీ...ప‌క్కాగా సుపారీ ఇచ్చి దారుణంగా హ‌త్య చేయించాడు. త‌న త‌మ్ముడు శ్ర‌వ‌ణ్ తో క‌లిసి పోయిన ప‌రువును కాపాడుకునే పైశాచిక‌త్వంలో క‌న్న కూతురి నుదుట బొట్టు చెరిపేశాడు. అయితే, అమృత  - ప్ర‌ణయ్ ల పెళ్లి ఇష్టం లేని మారుతీ రావు....త‌న కూతురు గ‌ర్భ‌వ‌తని తెలిసి అక్క‌సు పెంచుకున్నాడు. అబార్ష‌న్ చేయించుకోవాల‌ని ఒత్తిడి పెంచాడు. త‌న తండ్రి మాట అమృత అందుకు నిరాక‌రించింది. అయితే, అమృత త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోనే ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు దారి తీసింద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

త‌మ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను అమృత త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉండ‌డంతో 15 వేల లైక్స్ వ‌చ్చాయి. అస‌లే కోపంతో ర‌గిలిపోతోన్న మారుతీరావు కోపానికి  ఆ వీడియో ఆజ్యం పోసింది. దీంతో, ఎలాగైన ప‌గ తీర్చుకోవాల‌ని భావించిన మారుతీ రావు....నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్‌ వస్తాయని అమృతను హెచ్చరించాడని బంధువులు చెబుతున్నారు. ఈ పెళ్లికి తాము కూడా మొద‌ట‌ నిరాకరించామని, కానీ, ప్రణయ్‌ లేకపోతే చచ్చిపోతానని అమృత చెప్ప‌డంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్‌ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ, ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని దుర్మార్గంగా పొట్టనపెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బు - రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకొని కిరాయి హంతకులతో ఈ పని చేయించారని ఆరోపించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News