నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమృతను ప్రేమించిన పాపానికి ప్రణయ్ ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించారు. దళిత యువకుడైన ప్రణయ్ ను కిరాయి హంతుకులతో మారుతీరావు హత్య చేయించారు. గత ఏడాది జరిగిన ఈ హత్యలో ప్రధాన నిందితులుగా అమృత తండ్రిగా మారుతీరావు, కిరాయి హంతకుడు ఎంఏ కరీంలపై పోలీస్ స్టేషన్ లో శనివారం కేసు నమోదైంది.
కాగా ఈ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన మారుతీరావు తాజాగా తన కూతురు , ప్రణయ్ భార్య అమృత వర్షిణిపై బెదిరింపులకు దిగినట్టు కేసు నమోదైంది.
తాజాగా ప్రణయ్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ప్రణయ్ భార్య ఉంది. ఈ నేపథ్యంలోనే అమృత వర్షిణిని ఆమె తండ్రి మారుతీరావు, కరీం బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం మారుతీరావు తన సన్నిహితుడైన కందుల వెంకటేశ్వరరావును మత్తిరెడ్డికుంటలోని అమృత ఇంటికి రాయబారానికి పంపించాడు. ‘మీ నాన్న ఆస్తినంతా రాసిస్తాడని.. అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని’ బెదిరించినట్టు తెలిసింది. ఇక మీ నాన్నకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కేలా చేస్తానంటున్నాడు’ అని అమృతను ప్రలోభపెట్టినట్టు తెలిసింది.
కాగా తన తండ్రి మారుతీరావు మధ్యవర్తి ద్వారా బెదిరించడంపై అమృత ఈనెల 11న వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం మారుతీరావు, కరీం, వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. జైలుకు తరలించారు.