అది ఏ వ్యాపారమైనా కావొచ్చు. తాను నిర్వహిస్తానా? లేదా? అన్న సందేహాలు పడకుండా తాము టార్గెట్ చేసిన వ్యాపార సంస్థల్ని ఏదోలా తమ సొంతం చేసుకునే అద్భుతమైన టాలెంట్ అదానీ గ్రూప్ కు సాధ్యమన్న సంగతి తెలిసిందే. కన్య్జూమర్ ప్రొడక్ట్స్ మొదలు ఎయిర్ పోర్టులు.. పోర్టుల వరకు వ్యాపారం ఏదైనా కానీ తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలన్న మొండితనం అదానీలకు సొంతమని చెప్పాలి.
అనూహ్యంగా మీడియా వ్యాపారంలోకి వచ్చిన అదానీ.. దేశంలోనే అత్యంత పేరుప్రఖ్యాతులు ఉన్న ఎన్ డీటీవీని కొనుగోలు చేసే ప్రయత్నం అప్పట్లో పెద్ద వార్తగా మారింది. అయితే.. తమ అవసరం లేకుండానే కంపెనీషేర్లను సొంతం చేసుకున్న అదానీకి సదరు మీడియా సంస్థ అధినేతలు కమ్ జర్నలిస్టులు ప్రణవ్ రాయ్.. రాధికా రాయ్ దంపతులు ససేమిరా అన్న పరిస్థితి. తర్వాత ఏమైందో కానీ.. తాజాగా మాత్రంవారు తమ వద్ద ఉన్న వాటా మొత్తాన్ని అదానీకి ఇచ్చేందుకు రెఢీ అయిపోతున్నారు.
దీనికి సంబంధించిన కీలక ప్రకటన తాజాగా వెలువడింది. తాజా ప్రకటన నేపథ్యంలో ఎన్డీటీవీ న్యూస్ నెస్ వర్కులో రాయ్ దంపతులకు కేవలం 5 శాతం మాత్రమే మిగలనుంది. ఎన్ డీటీవీ న్యూస్ చానళ్ల ప్రమోటర్ దంపతులుగా పేరున్న రాయ్ దంపతులు తమ వద్ద ఉన్న వాటాను సొంతం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తమ వద్ద ఉన్న 32.26 శాతం వాటాలో ఐదు శాతం వాటాను ఉంచుకొని మిగిలిన 27.26 శాతం వాటాను అదానీకి ఇచ్చేందుకు సిద్ధమైన విషయాన్ని వారు ప్రకటించారు.
ఎన్డీటీవీని తమ వశం చేసుకోవటానికి అదానీ గ్రూప్ వ్యూహాత్మకంగా ఎత్తులు వేయటం తెలిసిందే. తొలుత సంస్థకు చెందిన 29.18 వాటాను వేరే మార్గంలో కొనుగోలు చేయటం తెలిసిందే. ఈ విషయాన్ని ఆగస్టులో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎన్డీటీవీలో మరింత వాటాను సొంతం చేసుకోవటానికి వీలుగా సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవటానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యం కాలేదు.
ఓపెన్ ఆఫర్ ద్వారా కేవలం 8.26 శాతం వాటాను మాత్రమే దక్కించుకుంది. దీంతో.. ఎన్ డీటీవీలో అదానీ వాటా 27.44 శాతం మాత్రమే అయ్యింది. ఇలాంటి వేళ ప్రణయ్ రాయ్.. రాధికారాయ్ లకు చెందిన 27.26 శాతం వాటాను సొంతం చేసుకోవటం ద్వారా.. సంస్థలో అదానీల వాటా ఏకంగా 64.7 శాతానికి పెంచుకునే పరిస్థితి.
తాజా ఎపిసోడ్ తో అదానీ చెప్పేసిన విషయం ఏమంటే.. తాము ఒకసారి ఫిక్సు అయ్యామంటే.. అదే కంపెనీ అయినా కావొచ్చు తమ సొంతం చేసుకుంటామన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.