దేశం మొత్తం నిన్న మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణల్లో లీనమైపోయారు. శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో హోరెత్తాయి. భక్తులతో కిట కిట లాడాయి. ఇదిలా ఉంటే రాజస్థాన్లో మాత్రం విషాదం చోటుచేసుకున్నది. ఓ ఆలయంలో ప్రసాదం తిన్న భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ప్రసాదం విషతుల్యమైనట్టు సమాచారం. దాదాపు 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానిక అధికారులు అంటున్నారు.
రాజస్థాన్లోని దుంగార్పూర్లో శివాలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సారి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పూజలు ముగిసిన వెంటనే ఆలయపూజారి భక్తులకు ప్రసాదం అందజేశారు. అయితే ఈ ప్రసాదం తిన్న దాదాపు 70 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఫుడ్ పాయిజన్ వల్లే భక్తులు అస్వస్థతకు గురయ్యారని.. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అస్వస్థతకు గురైన భక్తల నుంచి వైద్యులు షాంపిల్స్ సేకరించారు.మరోవైపు రాజస్థాన్ వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా.. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో, సీఎం క్యాంప్ ఆఫీసులో ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు.