వైసీపీ ఎమ్మెల్యే రాజీ...నామా

Update: 2015-06-24 11:18 GMT

వైఎస్సార్సీపీలో మరో సంక్షోభం చెలరేగి చల్లారింది. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లా సారథ్య బాధ్యతలకు రాజీనామా చేశారని ఓ మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి. సదరు రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్‌ ద్వారా అందజేశారని ఆ వార్తల్లో ప్రస్తావించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గంతో పొసగకే నల్లపురెడ్డి వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారని వివరించారు.

అయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ వార్తలను ఖండించారు. వైఎస్ఆర్సీపీని వీడే ఆలోచన తనకు లేదని తెలిపారు. చివరి వరకు పార్టీలోనే, జగన్ వెంటే ఉంటానన్నారు. జిల్లాలో తాను అందరితో కలుపుకొని వెళ్తున్నానని, పార్టీకి రాజీనామా చేశాననే వార్తలు అవాస్తవమని ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సదరు మీడియా సంస్థ బాధ్యతారాహిత్యంగా కథనాలు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Tags:    

Similar News