పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రంగంలోకి దిగితే.. సీన్ మొత్తాన్ని మార్చేయటమే కాదు.. గెలుపు ధీమా ఖాయమన్న మాట రాజకీయవర్గాల్లో ఉంది. 2014లో మోడీ సర్కారుతో పాటు.. యూపీలో బీజేపీ పాగా వేయటానికి పీకే వ్యూహాలే కారణమని చెబుతారు. తనలోని సత్తాను బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో మరోసారి ఫ్రూవ్ చేసిన పీకే.. తాను ఎవరితో జత కడితే వారికి అధికారం ఖాయమన్న విషయాన్ని ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో ఇంకోసారి నిరూపించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పీకే డిమాండ్ పీక్స్ కు చేరింది. చివరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం పీకేను తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకునేందుకు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు ఆయన చెప్పినట్లుగా వినేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు కొత్త ఆశగా ఆయన మారారు. పీకే అభయమిచ్చి.. పార్టీకి సలహాలు ఇవ్వటం మొదలు పెడితే చాలు పవర్ ఖాయమన్న మాట ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ కిశోర్ తో యాక్టర్ కమ్ పొలిటిషియన్.. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన మార్క్ ప్రభావాన్ని చూపించటంలో ఫెయిల్ అయిన కమల్.. మరో రెండేళ్లలో (2021)లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా పార్టీ వ్యూహాల్ని అందించేందుకు పీకేను సంప్రదించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. కమల్ పార్టీతో కలిసి పని చేసేందుకు పీకే ఓకే చెప్పారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. ప్రశాంత్ కిశోర్ ఉత్తగా ఏమీ అందరికి సలహాలు ఇచ్చేందుకు ఒప్పుకోరని చెబుతున్నారు.
గెలుపు అవకాశాలతో పాటు.. పార్టీకి ఉండే పట్టు.. ఎన్నికలకు ఉన్న గడువు.. ఇలాంటివెన్నో కాంబినేషన్లను చూసిన తర్వాత మాత్రమే ఆయన డీల్ కు ఓకే చెబుతారని చెబుతున్నారు. తమిళనాడులో బలమైన అన్నాడీఎంకే.. డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని తపిస్తున్న కమల్ కు.. పీకే ఓకే చెబుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కమల్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పీకే ఓకే చెప్పేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.