వైరల్ గా బైబై బాబు అంటూ పీకే ట్వీట్

Update: 2019-04-12 08:57 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహ నిపుణుడిగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయనకు చెందిన ట్విట్టర్ ఖాతాను పోలి ఉండేలా మార్ఫింగ్ చేసి.. ఒక ట్వీట్ ఆయన చేసినట్లుగా తయారు చేసి వైరల్ చేసే ప్రయత్నం చేసిన తెలుగు తమ్ముళ్ల తీరును పీకే తీవ్రంగా తప్పు పట్టారు. ఇదంతా బాబు పనే అంటూ ఆయన మండిపడ్డారు.

తాను, తన బృందంతో రెండేళ్లుగా పడిన శ్రమ వృథా అయిపోతోందని.. జగన్‌ మెజారిటీకి కావాల్సిన అసెంబ్లీ సీట్లను సాధించలేరని ప్రశాంత్‌ కిషోర్‌ పెట్టినట్లుగా ఒక తప్పుడు ట్వీట్‌ను సృష్టించడంపై ప్రశాంత్‌ కిషోర్‌  స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. బై..బై బాబు అంటూ ఆయన పెట్టిన ట్వీట్ లో బాబు మీద ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

"ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు.. వారి విజ్ఞత మీద నమ్మకం లేనప్పుడు.. దిగజారిపోయి నిందలేస్తారు.  అసత్యాలు.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తారు.  చంద్రబాబు తీవ్ర నిందలేసి.. దారుణమైన అబద్ధాలు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. వారి విశ్వాసాన్ని బాబు కోల్పోయారు.  ప్రజలంతా బైబై బాబు అంటూ తీర్పు ఇచ్చేశారు" అంటూ  ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్ లో వ్యాఖ్యానించారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.


Tags:    

Similar News