పీకే వ‌చ్చినా.. పీకేది ఏదీ ఉండ‌దా?

Update: 2021-08-27 15:30 GMT
ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు ఎంతో కృషి చేసిన విష‌యం తెలిసిం దే. రాజ‌కీయ వ్యూహ క‌ర్త‌గా పీకేకు మంచి పేరుంది 2014లో కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏర్పాటు లో ఈయ‌న కీల‌క పాత్ర పోషించారు. ఇక‌, ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డేందుకు ఆయ‌న ఎంతో కృషి చేశారు. ఇదిలావుంటే, ఇప్పుడు పీకే.. తెలంగాణ‌లో పార్టీ పెట్టి.. అదికారంలోకి రావ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా అడుగులు వేస్తున్న జ‌గ‌న్ సోద‌రి.. దివంగ‌త వైఎస్ త‌న‌య‌.. ష‌ర్మిల పార్టీతోనూ చేతులు క‌లిపిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం బ‌ట్టి.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ష‌ర్మిల‌తో చేతులు క‌లిపార‌ని.. ఆమెకు కూడా వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఆయ‌న అంగీక‌రించార‌ని.. దీనికి సంబంధించి ఒప్పందంపై కూడా సంత‌కాలు చేశార‌ని అంటున్నారు. వాస్త‌వానికి కొన్నాళ్ల కింద‌ట పీకే.. తాను వ్యూహ‌క‌ర్త‌గా త‌ప్పుకొంటున్నా న‌ని.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. దీనికి ముందుగానే ఆయ‌న ష‌ర్మిల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల కూడా ప్ర‌శాంత్ కిశోర్‌ను త‌న పార్టీ ముఖ్య వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నార‌ని.. స‌మాచారం.

ఇక‌, ఇప్ప‌టికే పీకే.. ష‌ర్మిల పార్టీ పుంజుకునే వ్యూహంలో భాగంగా 2023లో ఆమె పాద‌యాత్ర చేసేందుకు అవ‌స‌ర‌మైన ప్లాన్ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే. దీనిపై ఇంకా.. ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. మ‌రోవైపు.. ప్ర‌శాంత్ కిశోర్‌.. వ‌చ్చే నెల 1 నుంచి తెలంగాణ‌లో త‌న వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. అయితే.. పీకే వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణ‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. ఉద్య‌మ నేప‌థ్యంలో.. సొంత నేల‌, సొంత హ‌క్కులు అనే విధానంతో ఏర్ప‌డిన తెలంగాణ‌లో ఏపీ నుంచి వ‌చ్చిన ష‌ర్మిల నిల‌దొక్కుకోవ‌డం అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రోవైపు తెలంగాణ యూత్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కుష‌ర్మిల‌ను ఓన్ చేసుకోలేక పోయారు.వాస్త‌వానికి తెలంగాణ అంటేనే మాట‌ల మాంత్రికుల వంటి నాయ‌కులు కోకొల్ల‌లుగా ఉన్నారు. ఇలాంటి వారితో పోల్చుకుంటే.. ష‌ర్మిల ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక పోయారు. అదేస‌మ‌యంలో ఇక్క‌డి సంస్కృతి, సంప్ర‌దాయాలు కూడా ఆమెకు పెద‌ద్ద‌గా తెలియ‌వ‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ఇలాంటి స‌మ‌యంలో ఎన్ని వ్యూహాలు వేస్తే.. మాత్రం.. ప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది పెద్ద ప్ర‌శ్న‌.


ఇదిలావుంటే.. పార్టీ ప‌రంగా చూసుకున్నా.. ప్రెసిడెంట్ స్థాయి నేత‌లు ఎవ‌రూ పార్టీలోకి రావ‌డం లేదు. కొంత మంది ష‌ర్మిల ప‌ద‌వులు అమ్ముకుంటున్నార‌ని ఆరోపిస్తూ.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  పార్టీ మొద‌లు కూడా పెట్ట‌కుండా.. బ‌ల‌హీన ప‌డుతోంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి.. పీకే వ‌స్తాడు.. ఏదో పీకేస్తాడు.. అని అనుకోవ‌డం వృథా ప్ర‌యాస‌గా చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News