బాబును మళ్లీ ఏకేసిన ప్రశాంత్ కిశోర్

Update: 2019-04-11 15:52 GMT
సుప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ కీలకమైన పోలింగ్ రోజున ఏపీలో పరిణామాలపై  ఘాటుగా స్పందించారు. హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల పర్వంలో పోలింగ్ రోజున తన కేంద్రంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై భగ్గుమన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు కోల్పోవడంతో - ఓటమి స్పష్టమవడం వల్ల అసత్య వార్తలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ప్రశాంత్ కిశోర్ ఘాటు ట్వీట్ వెనుక టీడీపీ అనుకూల వర్గాలు చేసిన ప్రచారం కారణం. ‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం మేం పడిన శ్రమ వృథా అయింది. జగన్ అధికారం కైవసం చేసుకునే అవకాశం లేదు` అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేసినట్లు నకిలీ ఇమేజ్ చెలామణి అయింది. దీనిపై ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించారు. ``ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు - వారి విజ్ఞతమీద నమ్మకం లేనప్పుడు - ఇలా దిగజారిపోయి నిందలు వేస్తారు. అసత్యాలు - నకిలీ వార్తలు ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పును నిర్ణయించుకున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. బై బై బాబు అని చెప్పడానికి ఇదే సరైన సమయం.`` అంటూ ఘాటుగా స్పందించారు.

గత కొద్దికాలంగా టీడీపీ తన కేంద్రంగా చేస్తున్న ప్రచారంపై ప్రశాంత్ కిశోర్ అసహనం వ్యక్తం చేసిన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం - ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) టీడీపీకి అనుకూలంగా సర్వే చేసినట్టు ఓ మీడియా కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన ఐప్యాక్ సంస్థ ఆ వార్తలను ఖండించింది. ఆ మీడియా ప్రచురించిన కథనాలు ఊహాజనితమైనవని ఐప్యాక్ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది.
Tags:    

Similar News