వర్తమాన రాజకీయాల్లో వ్యూహాలకు కొదవ లేదు. కానీ.. వేసిన ప్రతి వ్యూహం సక్సెస్ కావాలన్న రూల్ లేదు. తాను ఫోకస్ చేసిన ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపుగుర్రంగా మార్చగలిగే సత్తా పొలిటికల్ టెక్ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ కే చెల్లుతుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పని చేసిన ఆయన.. తర్వాత బీహార్ ఎన్నికల్లో నితీశ్ ను ముఖ్యమంత్రిని చేసేలా వ్యూహం సిద్ధం చేశారు. తాజాగా కాంగ్రెస్ కు తన మేధో సాయం చేస్తున్న ఆయన.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతికి పవర్ తీసుకురావాలన్న గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులోభాగంగా ఇప్పటికే తన టీంలోని వారిని యూపీలోని వాడవాడలకు పంపి..క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పటికే ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ యూపీ సీఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీని కానీ.. ప్రియాంక గాంధీని కానీ ఎంపిక చేయాలన్న ఆలోచన చేసిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా వారిద్దరు కాకుండా బ్రాహ్మణ అభ్యర్థిని సీఎం క్యాండిడేట్ గా డిసైడ్ చేయాలని ప్రతిపాదిస్తున్నాడట.
ఈ ప్రతిపాదన వెనుక లెక్క చాలానే ఉందని చెబుతున్నారు. యూపీలో బ్రాహ్మణుల సంఖ్య 13 శాతమని.. ఆ వర్గానికి చెందిన నేతను సీఎం అభ్యర్థిగా నిర్ణయిస్తే వారి ఓట్లు అన్ని గంపగుత్తగా పడిపోతాయని.. కాంగ్రెస్ కు సంప్రదాయంగా వస్తున్న ముస్లిం ఓట్లన్నీ ఆ పార్టీకే పడతాయని చెబుతున్నారు. యూపీ ఎన్నికల్లో కనీసం 27 నుంచి 28 శాతం ఓట్లు కానీ తెచ్చుగలిగిన పార్టీకే అధికారపీఠం సొంతమవుతుందని చెబుతున్నారు.
ఈ వ్యూహంతో పాటు.. కాంగ్రెస్ కు చెందిన ఏవో కార్యక్రమాలు నిత్యం దినపత్రికల్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరిన్ని ఆలోచనలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహ చతురత యూపీలో ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.