చంద్రబాబుపై పీకే వీడియో వార్

Update: 2019-03-29 06:23 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓ ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే ఎన్నికల ప్రచార పాట యూట్యూబ్, సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోందని వివరించింది. ఇప్పటికే యూట్యూబ్ లో దీన్ని 6.3 మిలియన్ల మంచి చూశారని.. ఇప్పటివరకూ ఎన్నికల ప్రచార పాటల్లో ఇదే అత్యధికం అని వివరణ ఇచ్చింది. ఇది వరకు హిందీ లో రూపొందించిన ఫేమస్ ప్రచార పాటలైన ‘స్వాగత్ కే లియే తయార్, ఉత్తరప్రదేశ్ కి హో జయ్ జయకార్, ఆ రాషి బీజేపీ పాటలు కేవలం 4.7 మిలియన్ల వ్యూస్ మాత్రమే తెచ్చుకున్నాయని వివరణ ఇచ్చింది.

తాజాగా బీజేపీ విడుదల చేసిన ‘మేన్ బి చోకీదార్’ పాటను 9లక్షల 73వేల మంది చూశారని..  ఇప్పుడు ఆ పాటను మించిపోయేలా జగన్ పాట దూసుకెళ్తోందని వైసీపీ ప్రకటనలో తెలిపింది.

వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం ఈ పాటను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చేపట్టింది. ఇందుకోసం చాలా ఖర్చు చేసి వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని సమాచారం.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బృందం.. వైసీపీకి అనుకూలంగా ప్రజల్లో మంచి వేవ్ తీసుకునేందుకు సోషల్ మీడియా, యూట్యూబ్ లపై దృష్టి పెట్టి భారీగా ప్రచారం చేస్తోంది. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. ఈ వీడియోలను వ్యాప్తి చేస్తూ ప్రజలందరికీ చేరువ చేస్తోంది.

వైసీపీ విడుదల చేస్తున్న వీడియోలు టీడీపీని ఇరుకుపెడుతున్నాయి. దీనిపై ఈసీకి, సోషల్ మీడియా దిగ్గజాలకు కూడా ఫిర్యాదు చేసి వాటిని తీసివేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ కూడా ఇలా వైసీపీపై విషం కక్కుతోంది. కానీ వైసీపీ వీడియోలనే టార్గెట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News