మోదీ - నితీశ్ బంధం..గాడ్సే- గాంధీలాంటిది.: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు

Update: 2020-02-18 09:30 GMT
రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం సొంత రాష్ట్రం బీహర్ లోనే కొనసాగుతున్నాడు. జేడీయూ నుంచి అతడు బహిష్కరణకు గురయిన చాలా రోజులకు ఆయన మీడియాతో చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తన గురువు - బీహార్ ముఖ్యమంత్రి జేడీ-యూ అధినేత నితీశ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏతో కలిసి కొనసాగడంపై గాడ్సే బంధంగా అభివర్ణించారు. నితీశ్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. బీహర్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఇంకా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీతో పొత్తును కొనసాగిస్తూ రాజీ పడాలన్న నితీశ్ సిద్ధాంతం ఏమిటో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఎన్డీయేలో నితీశ్ కొనసాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో నితీశ్ కు - తనకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని - పార్టీ సిధ్ధాంతాల గురించి ఎన్నోసార్లు చర్చలు జరిగాయని వెల్లడించారు. అయితే తనకు ఎప్పుడూ నితీశ్ గాంధీజీ సిధ్ధాంతాలను వదలబోనని చెప్పేవారని - కానీ ఇప్పుడు గాంధీజీ హంతకుడైన నాథురాం గాడ్సే సానుభూతిపరులతో జేడీయూ నిండిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించినంత వరకు గాంధీజీ - గాడ్సే వేరువేరని తెలిపారు. ఇద్దరినీ ఒకే గాటన కట్టలేనని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ - ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య బంధాన్ని తెలిపారు.

ఇన్ని విమర్శలు చేసిన చివరకు నితీశ్ పై అభిమానం చూపించారు. నితీశ్ తనను కొడుకులా చూసుకున్నారు.. నేనూ ఆయనను తండ్రిలా భావించానని తెలిపారు. తనను జేడీయూ నుంచి బహిష్కరించినా తానేమీ బాధ పడడం లేదని పేర్కొన్నారు. ఏదిఏమైనా తాను నితీశ్ కుమార్ ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో తాను చేరానని స్పష్టం చేశారు.

బీహార్ రాష్ట్రం కోసం బాత్ బీహార్ కీ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ కార్యక్రమం వంద రోజుల పాటు కొనసాగిస్తానని తెలిపారు. దేశంలోని 10 ఉత్తమ రాష్ట్రాల్లో బీహార్ ఉండేలా బాత్ బీహర్ కీ కార్యక్రమం చేపట్టినట్లు, కోటి మంది యువతను కలవడమే తన లక్ష్యమని చెప్పారు.


Tags:    

Similar News