జ‌గ‌న్ గెలుపుపై పీకేకు ఇంత టెన్ష‌న్ మొద‌లైందా...!

Update: 2022-11-03 04:26 GMT
ప్ర‌శాంత్ కిశోర్‌. ఉర‌ఫ్ పీకే. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా 2012లో దేశ‌రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఐఐటీయెన్‌. అప్ప‌ట్లో బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర‌మోడీని ప్ర‌మోట్ చేయ‌డంలో కీల‌క రోల్ పోషించారు. త‌ర్వాత‌.. ఆయన గెలుపుతో దేశం దృష్టిని ఆక‌ర్షించారు. ఈ క్ర‌మంలోనే ఏపీలోని అప్ప‌టి ప్ర‌తిప‌క్షం వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న వ్యూహ‌కర్త‌గా వ్య‌వ‌హ‌రించి జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. పీకే చెప్పిన‌ట్టే పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌, న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను కూడా రూపొందించుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

జ‌గ‌న్ కోసం పీకే టీం దాదాపు 3 సంవ‌త్స‌రాలు ప‌నిచేసింది. ఒక సంవ‌త్స‌రం పాటుపీకే ఉమ్మ‌డి ఏపీ అంతా తిరిగి సామాజిక వ‌ర్గాల బ‌లాబ‌లాను కూడా అంచ‌నావేశార‌ని అంటారు. ఇలా ఆయ‌న ఇచ్చిన వ్యూహాల‌ను అందిపుచ్చుకున్న జ‌గ‌న్ విజ‌యం ద‌క్కించుకుని సీఎం సీటులో కూర్చున్నారు. అంతేకాదు, 151 మందిఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల‌ను సాధించారు. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో పీకే  ఈ విష‌యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''జ‌గ‌న్‌కు సాయం చేసే క‌న్నా.. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్‌కుచేసి ఉంటే బాగుండేది''అని ఆయ‌న‌వ్యాఖ్యానించారు.

అంతేకాదు, బిహార్ లో నితీశ్‌కుమార్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చిన విష‌యంపైనా పీకే రియాక్ట్ అయ్యారు. ఈ స‌మ‌యాన్ని కూడా కాంగ్రెస్ కోసం వెచ్చించి ఉంటే బాగుండేద‌ని చెప్పారు. ''ఈ రెండు నేను చేయ‌కుండా ఉండాల్సింది'' అని వ్యాఖ్యానించారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఈ ఇద్ద‌రు నాయ‌కుల కోసం చాలా స‌మ‌యాన్ని వృథా చేసుకున్న‌ట్టు పీకే అభిప్రాయ‌ప‌డుతున్నార‌నే భావ‌న వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్‌ను బ‌తికించుకునేందుకు ప్ర‌య‌త్నించి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే, వైసీపీని ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి ఆయన క‌నుస‌న్న‌ల్లోనే ఇప్ప‌టికీ జ‌గ‌న్ న‌డుస్తున్నారు. పీకేకు చెందిన ఐప్యాక్ టీం చెప్పిందే వేదంగా భావిస్తున్నారు. మ‌రి ఇప్పుడు పీకే ఎందుకు ఇలా వ్యాఖ్యానించార‌నేది వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ప్ర‌స్తుతం పీకే చేస్తున్న జ‌న్ సురాజ్ పాద‌యాత్ర‌కు సీఎం జ‌గ‌న్ నిధులు ఇస్తున్నార‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించిన పీకే.. ఇప్పుడు అనూహ్యంగా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. ఎక్క‌డో ఏదో తేడా కొట్టిందా? అనే చ‌ర్చ‌జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News