జ‌గ‌న్‌ ను ఇరికించబోయి టీడీపీని బుక్ చేసిన మంత్రి

Update: 2016-07-06 10:58 GMT
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస‌క్తిక‌ర స‌వాల్ విసిరారు. అయితే అది జ‌గ‌న్‌ను ఇరుకున పెట్ట‌డం కంటే టీడీపీని ప్ర‌శ్నించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ప‌త్తిపాటి ఏమ‌న్నాడంటే.. వైసీపీకి ప్రజల్లో నిజంగా పట్టు - అభిమానం ఉందనుకుంటే తక్షణం 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలిచి సత్తా నిరూపించుకోవాలని పుల్లారావు సవాల్‌ విసిరారు.

గుంటూరులో ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప స‌ర్వేపై మండిప‌డ్డారు. తమ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసే నైతికహక్కు వైసీపీకి - జగన్‌ కు లేదని అన్నారు. తొలుత తన పనితీరు - తనపై ఉన్న అవినీతి ఆరోపణలు - ఆస్తుల ఆటాచ్‌ మెంట్‌ పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప‌త్తిపాటి సూచించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామని, రానున్న మూడేళ్లలో మరికొన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడపగడపకూ వెళితే జగన్‌ కు - ఆయన పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతార‌ని పుల్లారావు అన్నారు. వైసీపీని విడిచి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోయారో? నీ ప్రవర్తన ఎలా ఉందో? ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని జగన్‌ కు హితవు పలికారు. అంత‌గా జ‌గ‌న్‌ కు ప్రజాబ‌లం ఉంద‌ని భావిస్తే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లోకి వెళ్లాల‌ని ఆయ‌న‌ సూచించారు. ఆ ఎమ్మెల్యేలు నెగ్గితే జ‌గ‌న్ ప్ర‌జాబ‌లంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని పుల్లారావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతికి పాల్పడినవారిలో అనేక మంది జగన్‌ వద్దే ఉన్నారని, వారి గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మంత్రి సూచించారు.

ప‌త్తిపాటి పుల్లారావు స‌వాల్ బాగానే ఉన్నాఇప్ప‌టికే వైసీపీ సైతం ఆయ‌న‌ లాగానే ఎన్నిక‌ల డిమాండ్ చేస్తోంది. త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నేప‌థ్యంలో వారి ప‌ద‌వికి రాజీనామా చేయించి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయించాల‌ని కోరుతోంది. ఒక‌వేళ ఆ ఎమ్మెల్యేలు సైకిల్ గుర్తుపై గెలిస్తే టీడీపీకి ప్ర‌జామోదం ఉంద‌ని తెలుస్తుంద‌ని పేర్కొంది. అయితే ఆ స‌వాల్‌ కు స్పందించ‌ని టీడీపీ ఇపుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయాల‌ని ప‌త్తిపాటి కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News