ప్రత్యూష,రాహుల్ తరచూ తాగి కొట్టుకునే వారా?

Update: 2016-04-02 09:35 GMT
చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య వ్యవహారంపై వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనుమానాస్పద రీతిలో ఉన్న ఆమె మరణం భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందన్నది ఒక వాదన అయితే.. కాదు.. ఆమెను చంపారే కానీ ఆత్మహత్య చేసుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రత్యూష స్నేహితులు.. బంధువులు సైతం ఆమె సూసైడ్ చేసుకుందంటే ఏ మాత్రం నమ్మటం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు తేల్చి చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యూష.. రాహుల్ కు సంబంధించిన ఆమె ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి వివరాలు చూస్తే.. మొదట్లో ఇరువురు చక్కగా ఉండేవారని.. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వారిద్దరూతాగి గొడవపడేవాళ్లని చెప్పుకొచ్చారు. గడిచిన కొన్ని నెలలుగా ఇరువురి మధ్య సంబంధాలు అంత చక్కగా లేవని.. ఇరువురు తగువులాడుకునే వారని తెలుస్తుంది. మరోవైపు.. ముంబయి శివారులో ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ప్రత్యూష సూసైడ్ ఇష్యూలో రాహుల్ వాదన ఏమిటన్నది బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Tags:    

Similar News