ఆత్మహత్య చేసుకున్న హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీకి సంబంధించి కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అంత పేరున్న నటి తన ఇంటి పని మనిషి దగ్గర కూడా అప్పులు చేసినట్లు వెల్లడవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యూష చనిపోవడానికి ముందు మూడు నెలల పాటు ఆమె ఇంట్లో పని చేసిన రేణు సిన్హా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. ప్రత్యూష.. ఆమె ప్రియుడు రాహుల్ మధ్య సంబంధాల గురించి రేణు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
అప్పుడప్పుడు ప్రత్యూష క్యాబ్ ఛార్జీల కోసం.. మందుల కోసం తన దగ్గర డబ్బు తీసుకుంటూ ఉండేదని రేణు తెలిపింది. ప్రత్యూషకు సంబంధించిన ఆర్థిక విషయాలన్నీ రాహులే చూసుకునేవాడని.. ఆమె దగ్గర ఖర్చులకు కూడా పెద్దగా డబ్బులుండేవి కాదని ఆమె చెప్పింది. అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయాల్లో ప్రత్యూష-రాహుల్ గది నుంచి అరుపులు వినబడుతుండేవని.. వాళ్లిద్దరూ తరచుగా గొడవ పడుతుండేవారని ఆమె తెలిపింది. తాను చాలాసార్లు వారిని అడ్డుకోవాలని భావించేదాన్నని.. ఐతే వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతో ఆగిపోయేదాన్నని రేణు చెప్పింది.
రాహుల్ ఇంటి నుంచి బయటకు వెళ్లాక గొడవ గురించి ప్రత్యూష చెప్పేదని.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి రాహుల్ ప్రస్తావించి వేధించేవాడని ప్రత్యూష చెప్పుకుని బాధపడిందని రేణు వెల్లడించింది. రాహుల్ చేతిలో ప్రత్యూష దెబ్బలు తిన్న సందర్భాలు చాలానే ఉన్నాయని ఆమె చెప్పింది. సినిమా.. షాపింగ్ లాంటి చిన్న చిన్న కోరికల విషయంలో కూడా ప్రత్యూషకు రాహుల్ ఆంక్షలు విధించేవాడని రేణు వెల్లడించింది. రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇంటికొచ్చి ప్రత్యూషను దుర్భాషలాడేదని.. అయినా రాహుల్ తో ప్రత్యూష బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుందని చెప్పింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాహుల్ వాయిదా వేసేవాడని.. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయేదని తెలిపింది.