వీడ్కోలు; ‘ఆనంది’ అంత్యక్రియులు అలా చేశారు

Update: 2016-04-03 09:27 GMT
చిన్నారి పెళ్లికూతురు ‘ఆనంది’ ప్రత్యూష బెనర్జీ అంత్యక్రియులు పూర్తి అయ్యాయి. ముంబయిలోని తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకున్న ఆమె వీడ్కోలు యాత్ర ఆదివారం నిర్వహించారు కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు.. అభిమానుల వెంట రాగా హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను ఖననం చేశారు. మధ్య ముంబయిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్థివ దేహానికి పెళ్లికూతురుగా ముస్తాబు చేయటం గమనార్హం.

త్వరలో తన పెళ్లి వస్త్రాల్ని డిజైన్ చేయాల్సి ఉంటుందని డిజైనర్ రోహిత్ వర్మను ప్రత్యూష కోరటం.. అంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవటంపై ఆమె స్నేహితులు షాకింగ్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె పార్థిప దేహానికి పెళ్లికూతురుగా అలంకరించారు.

ఇక.. ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే..

= ప్రత్యూష మృతి మీద తమకు చాలానే సందేహాలు ఉన్నట్లు ఆమె తల్లి డాలీ చెబుతున్నారు. ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉండటం.. నుదిటి మీద తాజా సింధూరం కనిపించటం లాంటివి చూస్తే ఆమెది ఆత్మహత్యగా కనిపించటం లేదని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు చాలానే సందేహాలు కలిగేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

= ప్రత్యూష సూసైడ్ ఉదంతంలో సందేహాలు వ్యక్తమవుతున్న ఆమె బాయ్ ఫ్రెండ్  రాహుల్ రాజ్ సింగ్ ను పోలీసులు 14 గంటల పాటు విచారించారు.

= ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆమెకు ఆర్థిక సమస్యలు ఉన్నాయనటం నిజం లేదని ఆమె సన్నిహితులు చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News