ప్రత్యూష సూసైడ్..నాటి ప్రత్యూషను గుర్తుకు తెస్తోంది

Update: 2016-04-02 11:30 GMT
చిన్నారి పెళ్లకూతురు ఆనంది ఫేం ప్రత్యూష సూసైడ్ మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని.. చంపేశారన్న వాదన కొందరు బలంగా వాదించటం.. ఆమె ముఖం మీద గాయాలు ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. అదే సమయంలో ఆమె మరణానికి కారణంగా ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుల్లితెర నటి అయిన ప్రత్యూష సూసైడ్ ఉదంతం నేపథ్యంలో దాదాపు 14 సంవత్సరాల క్రితం టాలీవుడ్ హీరోయిన ప్రత్యూష సూసైడ్ గుర్తుకు రాక మానదు. చక్కనైన చందమామలా ఉండే ప్రత్యూష.. ప్రేమ పంచాయితీలోనే సూసైడ్ చేసుకున్నదన్న వాదనలు.. అంతలోనే ఆమె మరణంపై బోలెడన్ని సందేహాల నడుమ.. అప్పట్లో ఆ ఇష్యూ పెను సంచలనంగా మారింది.

ఇద్దరు నటీమణుల పేర్లు ఒకటే కావటం.. ఇద్దరూ సూసైడ్ చేసుకోవటం.. ఇద్దరి మరణాలు అనుమానాస్పదంగా ఉండటం లాంటి చాలా అంశాలు ఒకేలా ఉండటం గమనార్హం. తాజా ప్రత్యూష మరణం వెనుక ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ కారణమై ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమైతే.. నాటి టాలీవుడ్ నటి ప్రత్యూష సూసైడ్ విషయంలో ఆమె ప్రియుడు సిద్ధార్థ ఉన్నట్లుగా సందేహాలున్నాయి. ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో సిద్ధార్థ బతికి బయటపడ్డాడన్నది ఒక వాదన అయితే.. ప్రత్యూషను సిద్ధార్థ కూల్ డ్రింక్ లో విషం పెట్టి చంపేశాడన్నది మరో ఆరోపణ.

ఏది ఏమైనా.. పేర్లు ఒకటైన ఈ నటీమణుల జీవితాలు అంతిమంగా సందేహాస్పదంగా.. విషాదంగా ముగియటం ఒక ఎత్తు అయితే.. ఇద్దరి మరణానికి సంబంధించి కాస్త ఫోలికలు కనిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News