గత కొన్నేళ్లుగా కమలనాథుల నోటి నుంచి వినపడని రామమందిర నినాదం ఈ మధ్యన తరచూ వినిపిస్తోన్న పరిస్థితి. అయితే.. ఇకపై ఆ నినాదం మరికొన్ని రోజులు వినిపించే ఛాన్స్ లేదని చెబుతున్నారు వీహెచ్ పి నేత ప్రవీణ్ కుమార్ తొగాడియా. అయోధ్యలో రామమందిరనిర్మాణమే లక్ష్యమైనప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఆ విషయం మీద రచ్చ చేయమని చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో రామాలయ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి రాజకీయంగా ఇబ్బంది పెట్టబోమని బీజేపీకి భరోసా ఇస్తూ వ్యాఖ్యలు చేయటం విశేషం. ప్రధాని మోడీ తమకు పెద్దన్నతో సమానమని.. అలాంటి పెద్దన్నకు కష్టం కలిగేలా తమ్ముళ్ల మైన తాము వ్యవహరించమని.. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత రామ మందిర నిర్మాణం గురించి గళం విప్పుతామని ఆయన వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. యూపీ ఎన్నికల తర్వాత రామ మందిర రచ్చ జోరుగా సాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.