వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దాడులను అరికట్టేందుకు కేరళ మహిళా కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్ కు హాజరుకావాలని సూచించింది. వధూవరులకు ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహించి ఆ ధ్రువపత్రాన్ని పొందుపరిస్తేనే వివాహాన్ని అధికారికంగా నమోదు చేయాలని కేరళ ప్రభుత్వానికి సూచించింది. వివాహబంధంలో ఎదురయ్యే సమస్యలపై ఈ కౌన్సిలింగ్ లో వారికి అవగాహన కల్పించనున్నట్లు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పీ సతీదేవి తెలిపారు.
కేరళలో మహిళలపై గృహహింస కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సతీదేవి చెప్పారు. ఇప్పటికే చాలా మంది భర్త, అత్తమామల చేతిలో చిత్రహింసలు అనుభవించి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడగా , మరికొంత మంది దారుణ హత్యలకు గురైనట్లు వివరించారు. ముఖ్యంగా జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్రా, విస్మయ కేసులను గుర్తు చేసిన ఆమె వారి మరణానికి భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్ ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేరళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సతీదేవి తెలిపారు.