రాత్రి వేళ.. రోడ్డు మీద కారు ఆపి.. కేటీఆర్ చేసిన సాయం గురించి తెలిస్తే ఫిదా
అనుకోని పరిణామాలు చోటు చేసుకున్న వేళలో.. సమయస్ఫూర్తితో వ్యవహరించటం.. సాయం చేసే తీరును ప్రదర్శించటం..పెద్ద మనసుతో స్పందించే గుణం నాయకులకు ఉండాల్సిన లక్షణాలు. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించిన అందరి అభినందనలు అందుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. రోడ్డు మీద ఏం జరిగినా మాకేంటి? మా దారిన మేం పోతాం.. మిగిలిన వారి సంగతి పట్టించుకోమన్నట్లుగా డాబు కొట్టకుండా.. కష్టంలో ఉన్న వారి కోసం సాయం చేయాలని తపించే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను అభినందించాల్సిందే.
తాజాగా ఆయన చేసిన సాయం గురించి ఒక నెటిజన్ వీడియోతో సహా షేర్ చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది. సోమవారం రాత్రి సిద్ధిపేట పట్టణం కాళ్లకుంట కాలనీకి చెందిన 26 ఏళ్ల జాఫర్.. 30 ఏళ్ల యాకూబ్ లు ఇద్దరూ కలిసి టూ వీలర్ మీద సిద్ధిపేట వైపు వెళుతున్నారు. వేగంగా వెళ్లటం కానీ మరే ఇతర కారణం వల్ల కానీ బైక్ అదుపు తప్పింది. దీంతో వారి బైక్ డివైడర్ ను ఢీ కొట్టేసింది. దీంతో ఈ ఇద్దరు యువకులు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న మంత్రి కేటీఆర్.. జరిగిన ప్రమాదాన్ని చూసినంతనే తన కాన్వాయ్ ను ఆపేశారు. వెంటనే తన కాన్వాయ్ లోని రెండు వాహనాల్లో క్షతగాత్రులు ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే.. ఎంత త్వరగా వైద్యం అందితే అంత మంచిదన్న విషయం తెలిసిందే.
రాత్రి వేళ దాదాపు పదిన్నర గంటల వేళలో.. వేగంగా వెళుతున్న కాన్వాయ్ లో.. చీకట్లో ఉన్న రోడ్డు మీద జరిగిన ప్రమాదాన్ని గుర్తించటం.. ఆ వెంటనే సాయం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకొని వాహనాల్ని ఆపి.. సిబ్బందితో వారిని ఆసుపత్రికి పంపించాలన్న నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఈ ప్రమాదం సందర్భంగా మంత్రి కేటీఆర్ దగ్గర ఉండి మరీ బాధితుల్ని ఆసుపత్రికి పంపించిన వైనానికి సంబంధించిన చిట్టి వీడియోను సోషల్ మీడియాలో ఒక నెటిజన్ షేర్ చేయటం.. ఇది కాస్తా వైరల్ గా మారింది. కేటీఆర్ చేసిన సాయాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Full View
Full View Full View