ఆ ఆనందం మొత్తం ఒక్క క్షణంలో ఆవిరైపోయనే ...హృదయాన్ని బరువెక్కించే ఘటన ..ఏమైందంటే !
ఎన్నో కళలు , ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ జంట , తమ జీవితం ఆలా ఉండాలి , ఇలా ఉండాలి అంటూ ఎన్నో ఊహలతో జీవించారు. ఆ ఊహలని నిజం చేసుకోవడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంతలో వారికీ మరో శుభవార్త ఎక్కడలేని ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆమె తొమ్మిదినెలల గర్భిణి. త్వరలోనే పెళ్లి రోజు కూడా వస్తుండటం , మరికొన్ని రోజుల్లోనే బుడిబుడి అడుగులు వేయడానికి మరో కొత్త మనిషి వారి ఇంట్లోకి రాబోతుండటం తో వారి ఆనందానికి అవధులేవు. కానీ , వారి ఆనందం చూసి ఆ దేవుడు కూడా కుళ్లుకున్నట్టు ఉన్నాడు. మరో మూడురోజుల్లో కాన్పు అయితే, తమ ప్రతిరూపాన్ని కళ్లారాచూసుకునే అద్భుత ఘడియలకు మరికొంత సమయమే మిగిలి ఉందనుకుంటూ కాబోయే తల్లిదండ్రులు బైక్‌పై ప్రయాణం సాగిస్తున్న సమయంలో ఒకే క్షణంలో వారి వైపుకి దూసుకొచ్చిన లారీ వారి కలలని ఛిద్రం చేసేసింది, ఆ తల్లి కలల్నీ.. ఆమె దేహాన్నీ.. బిడ్డ ప్రాణాలతో సహా. ఈ సంఘటన తో పరిసర గ్రామాలన్నీ కూడా నిబద్దంగా మారిపోయాయి.
పూర్తి వివరాలు చూస్తే .. రామచంద్రారావు బంజర గ్రామానికి చెందిన బలుసుపాటి మురళి, తొమ్మిది నెలల గర్భవతి అయిన తన భార్య కల్యాణి(20)ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం బైక్ పై తీసుకెళ్లాడు. మూడురోజుల్లో కాన్పు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆ వార్త విని ఎంతో ఆనందంతో బైక్ పై ఆ మళ్లీ ఇంటికి బయల్దేరారు. ఈ సమయంలో గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ వద్దకు రాగానే వరుసగా లారీలు వేగంగా దూసుకొచ్చాయి. దీంతో బైక్ ను రోడ్డు దించి, మళ్లీ రోడ్డు ఎక్కించే ప్రయత్నంలో ఒక్కసారిగా స్పీడ్ గా వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీనితో కిందపడిన గర్భిణి కల్యాణిపై నుంచి లారీ వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కడుపులో ఉన్న తొమ్మిది నెలల శిశువు రోడ్డుపక్కన పదిమీటర్ల దూరంలో పడిపోయింది. మురళీ రోడ్డుపక్కన పడ్డాడు. లారీ కల్యాణి పై నుండే వెళ్లడంతో ఆమె మృతదేహం కూడా చూడటానికి వీలులేకుండా అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి శిశువును ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే శిశివు కూడా మృతిచెందింది. గర్భిణి కల్యాణి ఆమె మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టని వారెంటులేరు. వీరికి ఇంకా పెళ్లి అయ్యి ఏడాది కూడా పూర్తి కాలేదు. అలాగే మరో మూడురోజుల్లో తల్లిదండ్రులవుతామనే ఆనందంలో ఉండగా.. ఈ దారుణమైన సంఘటన జరగడంతో బంధువులు కన్నీరుమున్నీరౌతున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన అక్కడి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి , లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.