ఇవాల్టి రోజున సరదాగా చేసే వ్యాఖ్యలు సైతం రివర్స్ అయి తలకు బొప్పి గట్టే ధోరణి పెరుగుతోంది. చేసిన వ్యాఖ్యల ముందు వెనుక ఉన్న అంశాలు.. చేసిన సమయం.. చేసిన వారి మైండ్ సెట్.. వారు ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారన్న విషయాల్ని పట్టించుకోకపోవటం వల్ల వచ్చిన ఇబ్బందే అసలు కారణం. గతంలో ఇలాంటివన్నీ చెక్ చేసుకొన్నాకే మీడియాలో వచ్చేవి.
కానీ.. పెరిగి సోషల్ మీడియా జోరుతో.. ఎవరికి ఏ విషయం తెలిసినా.. వెంటనే షేర్ చేసుకునే అవకాశం ఉండటం.. అవి కాస్తా వైరల్ గా మారటంతో.. అదో ఇష్యూలా మారిపోతున్న పరిస్థితి. ఇలాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడాదామన్న ఆలోచన లేకుండానే ప్రముఖులు ఎప్పటిలానే తమకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
అతడనుకున్నట్లు అందరూ అతని వ్యాఖ్యల్ని సరదాగా తీసుకుంటే ఓకే. లేకుంటే లేనిపోని ఇబ్బందులే. ఇంతకీ అతగాడు ఏం మాట్లాడారంటే.. ఆడోళ్లతో టైం గడపటం కష్టమన్న భజ్జీ.. ‘గర్భంతో ఉన్నా మామూలుగా ఉన్న ఆడాళ్లతో టైం స్పెండ్ చేయటం కష్టం’ అని వ్యాఖ్యానించాడు. ఇలాంటివి మహిళల మనోభావాల్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. అంత ఇబ్బంది అయితే పెళ్లి ఎందుకు చేసుకున్నావ్? అంటూ మహిళలు విరుచుకుపడొచ్చు. అయినా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయనంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ.. ఇలాంటివి మాట్లాడి అడ్డంగా బుక్ అవ్వటం ఎందుకు భజ్జీ అన్న మాట వినిపిస్తోంది.
త్వరలో తండ్రి కాబోతున్న భజ్జీ.. ఆ టైం కోసం తానెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. గత అక్టోబర్ లో బ్రిటీష్ జాతీయురాలు గీతా బస్రాను పెళ్లాడిన భజ్జీ.. తండ్రి కాబోతన్న నేపథ్యంలో భార్యతో కలిసి.. పిల్లల్ని ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని చెప్పే ప్రి నాటల్ క్లాసులకు వెళ్లినట్లు చెప్పాడట. ఇలాంటి ముచ్చట్లు చెప్పుకునే బదులు.. ఆడోళ్ల మీద అనవసరమైన వ్యాఖ్యలుఅవసరమా భజ్జీ?