ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభణ వేళ... దేశంలోని ప్రభుత్వ వైద్యులు అహోరాత్రులు పనిచేస్తున్నారు. వైద్య చికిత్సల్లో తలమునకలై ఉన్న సదరు వైద్యులకు సరిపడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకున్నా కూడా వైద్యులు ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి వేళ... దేశంలోనే ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ అఖిల భారత వైద్య విజ్ఝాన సంస్థ (ఎయిమ్స్)లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. అక్కడితో పరిస్థితి ఆగి ఉంటే ఏమోలే అనుకోవచ్చు... నెలలు నిండిన గర్భవతి అయిన ఆయన సతీమణికి కూడా ఈ వైరస్ సోకింది. ఏ క్షణాన్నైనా డెలివరీకి సిద్ధంగా ఉన్న ఆమెను ఎయిమ్స్ వైద్యులు కరోనా రోగులు ఉండే వార్డులోనే చేర్చేశారు. చికిత్స కూడా ప్రారంభించేశారు. అయినా డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భవతికి కరోనా సోకితే... మరో స్సెషల్ వార్డులో చేర్సాల్సిన వైద్యులు... జన్మించే పసిబిడ్డకు కూడా కరోనా సోకితే పరిస్థితి ఏమిటన్న విషయాన్ని మరిచి కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన వార్డులోనే ఆమెను చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
ఈ ఘటన పూర్తి విరవరాల్లోకి వస్తే... ఎయిమ్స్ లో ఫిజియాలజీ విభాగంలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న ఓ వైద్యుడికి గురువారం ఉదయం కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరించిన వైద్యులు... ఆయనకు చికిత్సలు మొదలుపెట్టారు. ఈ వార్తతో ఆ కుటుంబం షాక్ లో కూరుకుపోగా... మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా సాయంత్రానికంతా నెలలు నిండిన గర్భవతి అయిన ఆ వైద్యుడి సతీమణికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో ఆ ఫ్యామిలీ షాక్ లో కూరుకుపోయింది. ఇదిలా ఉంటే... వైద్యుడి సతీమణి ఏ క్షణాన్నైనా డెలివరీ కానుందట. అయితే ఇవేవీ పట్టని ఎయిమ్స్ వైద్యులు తమ సహచర వైద్యుడిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేసి... నిండు గర్బిణీని మాత్రం ఎయిమ్స్ లో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన వార్డులోనే చేర్పించేశారట.
ఈ ఘటనపై ఇప్పుడు ఆసక్తికర చర్చతో పాటు ఎయిమ్స్ వైద్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిండు నెలల గర్బిణీని కరోనా రోగులుండే వార్డులో చేరిస్తే.. అక్కడే ఆమె డెలివరీ అయితే... ముక్కుపచ్చారని పసిపాపకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి? అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయినా నెలలు నిండిన గర్బిణీ అని తెలిసి కూడా ఆమెను కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన వార్డులోనే చేర్చిన వైద్యులకు అసలు జరిగే విపరిణామాలు ఏమిటో? తెలియవా? అన్న వాదన వినిపిస్తోెంది. నెలలు నిండిన సదరు గర్బవతి తమ సహచరుడి సతీమణి అన్న విషయాన్ని కూడా మరిచిన ఎయిమ్స్ వైద్యులు... త్వరలో జన్మించనున్న పసిబిడ్డకు కరోనా సోకితే... బాధ్యత వహిస్తారా? అన్న దిశగానూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఎయిమ్స్ వైద్యుడికి కరోనా సోకడంతో ఇప్పటిదాకా ఢిల్లీలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య 8కి చేరింది.