ఘోరం జరిగింది. మానవత్వం తలదించుకునేంత దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి.. పెళ్లి చేసుకుందన్న కోపంతో చేసిన కిరాతకం వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటం ఖాయం. నిండు గర్భిణి అన్న స్పృహ లేకుండా అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులే సజీవ దహనం చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? అన్నది చూస్తే..
కర్ణాటకలోని 21 ఏళ్ల భానూ బేగం తన ఊరికే చెందిన 24 ఏళ్ల దళిత యువకుడు శరణప్పను ప్రేమించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు.. పెళ్లికి ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరి ప్రేమ వ్యవహారంపై భానూ బేగం తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించినా.. శరణప్పపై ఎలాంటి నేర చరిత్ర లేకపోవటంతో అతడ్ని వదిలేశారు. చివరకు.. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో రహస్యంగా ఊరు విడిచి గోవాకు వెళ్లిపోయారు. అనంతరం కర్ణాటకలో కొంతకాలం ఉన్నారు.
ఈ క్రమంలో భాను గర్భవతి కావటంతో తమ కుటుంబాల మనసులు మారి ఉండొచ్చన్న ఉద్దేశంతో జూన్ 3న ఇద్దరూ ఊరికి వచ్చారు. అయితే.. తమ మీద ఇరు కుటుంబాల్లోనూ ఆగ్రహం చల్లారలేదన్న విషయాన్ని గుర్తించే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. వీరిద్దరిని చూసినంతనే భాను తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. శరణప్పపై రాళ్ల దాడికి దిగారు. దీంతో.. స్థానికంగా ఉన్న తాలికోట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. జరిగిన విషయాన్ని చెప్పి .. తన భార్యను కాపాడాలని కోరారు. స్పందించిన పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
అప్పటికే భానును వారి కుటుంబ సభ్యులు కత్తితో పలుమార్లు పొడిచేయటమే కాదు.. సజీవ దహనం చేసినట్లుగా గుర్తించారు. పట్టపగలు ఇంత దారుణం చోటు చేసుకున్నా.. గ్రామంలోని వారెవరూ వీరికి సాయంగా నిలవకపోవం సంచలనంగా మారింది. ఎవరికి వారు తమ ఇళ్లల్లో తలుపులు వేసుకొని ఉండిపోయారే తప్పించి.. బయటకు రాలేదని చెబుతున్నారు. ఈ దుర్మార్గానికి కారకులుగా భావిస్తున్న భాను తల్లిని.. సోదరి.. సోదరుడ్ని అరెస్ట్ చేశారు. భాను మరో ఇద్దరు అక్కల కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. గర్భిణి అన్న కనికరం లేకుండా కిరాతకంగా కత్తులతో పొడిచి.. సజీవ దహనం చేయటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ప్రేమించి తప్పు చేశారనే అనుకున్నా.. దానికి మరీ ఇంత దారుణ శిక్షా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/