నిత్యం హత్యలు.. ఆత్మహత్యలు.. దారుణాలు ఎన్నింటినో చూసే పోలీసులకు సైతం షాక్ తినిపించిన ఘటన హైదరాబాద్ మహానగరంలో సంచలనంగా మారింది. ఖాకీలు సైతం జీర్ణించుకోలేని రీతిలో అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం చేసిందెవరో అర్థం కానిదిగా మారింది. ప్రతి నేరస్తుడు ఏదో ఒక తప్పు చేస్తాడన్న కోణంలో విచారిస్తున్న పోలీసులకు ఈ హత్య పెను సవాల్ గా మారింది.
ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకటం ఒక ఎత్తు కాగా.. ఐటీ కంపెనీల్లో వినియోగించే గార్బేజ్ బ్యాగుల్లో ప్యాక్ చేసిన వైనం విస్తుపోయేలా చేస్తోంది. తల కాళ్లు.. చేతులు ఒక సంచిలో.. మొండం మరొక సంచిలో మూటగట్టి రోడ్డు మీద బ్యాగులో పడేయగా.. తీవ్ర దుర్గంధం వస్తున్న వైనంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూటలు విప్పగా.. మహిళ శరీరాన్ని ముక్కలు.. ముక్కలుగా నరికిన వైనాన్ని గుర్తించారు. హైదరాబాద్ లోకి కొండాపూర్ ప్రాంతంలోని బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ వైనం పెను సంచలనంగా మారింది. మృతురాలి శరీర భాగాలతో పాటు.. ఆమె ధరించిన డ్రెస్ ను ఇదే బ్యాగ్ లో ఉంచారు. ఎరువు రంగు ఫైజమా.. చాక్లెట్ రంగు కుర్తా.. పగిలిన గాజులు.. చెవిదిద్దులు ఈ ప్యాక్ లో లభించాయి
ఈ మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు.. మృతురాలు ఎనిమిది నెలల గర్భవతి అన్న విషయం బయటకు వచ్చింది. మర్డర్ జరిగిన ప్రాంతానికి డాగ్ స్క్వాడ్ కు రప్పించగా.. అక్కడే అవి తచ్చాడాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒక మహిళను ఇంత పాశవికంగా హత్య చేయటం ఒకరితో సాధ్యం కాదని.. ఇందుకు కొద్ది మంది కారణమై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఆమెకు బాగా తెలిసిన వారే ఇంత దారుణంగా హత్య చేసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఈ హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? దీని నేపథ్యం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. ఎనిమిది నెలల నిండు గర్భిణిని అంత దారుణంగా ఎందుకు చంపారు? అన్న ప్రశ్న ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. శరీర భాగాలతో లభ్యమైన సంచుల్లో దొరికిన గాజులు.. మెట్టల్ని పరిశీలిస్తే.. బాధితురాలు ఉత్తరాదికి చెందిన మహిళగా అంచనా వేస్తున్నారు. ఎనిమిది నెలల గర్భవతి కావటంతో ఏదైనా ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఉండొచ్చన్న అంచనాతో ఆమె వివరాలు సేకరించటానికి వివిధ ఆసుపత్రుల్ని సంప్రదిస్తున్నారు. అదే సమయంలో.. సీసీ కెమేరా ఫుటేజ్ ను సైతం పరిశీలిస్తున్నారు. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు ఒక యువతిపై ఇంత దారుణంగా చంపేటంత కసి ఎందుకు అని విస్తుపోతున్నారు. చంపడమే దారుణం అయితే... ముక్కలుగా నరికేటంత కోపం నిందితులకు ఎందుకు వచ్చింది? ఆమె ఏం పాపం చేసింది?