అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపి , ఇప్పటికే ఆ వ్యాక్సిన్ వితరణ కూడా ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ కు అనుమతిచ్చిన ఏకైక దేశం బ్రిటన్ మాత్రమే. ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్ కూడా సన్నహాలు చేస్తోంది. దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమైంది. ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో నిల్వ చేయాలి. దీనితో కార్గో విమానంలో, విమానాశ్రయంలో, అక్కడి నుంచి దేశంలోని నలుమూలలకు వ్యాక్సిన్ ను తరలించేందుకు తగిన శీతల కంటేనర్లను, వాటిలో వచ్చే ఫైజర్ వ్యాక్సిన్ డోసులను నిల్వచేసే శీతల ల్యాబ్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.
ముంబై లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ దిగుమతి చేసుకున్న తర్వాత వ్యాక్సిన్ పంపిణి లో ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర వహించనుంది. ఇప్పటికే 30 వేల టన్నుల మందులను నిల్వచేసే శీతల గిడ్డంగులు కలిగి ఉండడం వల్లనే శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం ఎంపిక చేసింది. సంవత్సరానికి మూడున్నర లక్షల టన్నుల మందులను హాండిల్ చేయగల సామర్థ్యం కలిగిన ఎక్స్ పోర్ట్ ఫార్మా ఎక్స్ లెన్స్ సెంటర్ నాలుగువేల చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అతిశీతల కేంద్రం ఇదే.
ప్రస్తుతం ఈ అతిశీతల గిడ్డంగిలో ఉన్న అన్ని ఔషధాలను వాటి గమ్యస్థానాలకు పంపించి, కరోనా వ్యాక్సిన్లను భద్రపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై త్వరలోనే ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు విమానాశ్రయం అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీదారులు, వాటి రవాణాదారులు, ప్రభుత్వ మందుల నియంత్రణా యంత్రాంగం ప్రతినిధులు, దేశంలోని ఇతర విమానాశ్రయాల ప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ అధికార ప్రతినిధి వివరించారు. కార్గో విమానాల్లో శీతల కంటేనర్ల ద్వారా వ్యాక్సిన్ డోస్ లను తీసుకరావడం, వాటిని నేరుగా విమానాశ్రయంలోని అతిశీతల గిడ్డంగికి తరలించడం, అక్కడి నుంచి దేశంలోని నిర్దేశిత శీతల ల్యాబ్ లు లేదా గిడ్డంగులకు తరలించడం, అక్కడి నుంచి వాటిని వైద్య సిబ్బందికి, వినియోగదారులకు చేరవేయడంలో ఎక్కడా ఆటంకాలు ఎదురుకాకుండా ఈ టాస్క్ ఫోర్స్ చూసుకుంటుంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందజేసేందుకు 24 గంటలు పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్ ను కూడా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.