ఏపీలో‘ప్రెసిడెంట్ మెడల్’ విస్కీ.. చంద్రబాబు ఘనతే?

Update: 2020-08-19 06:15 GMT
ఏపీలో మద్యపాన నిషేధం దిశగా సాగుతున్న జగన్ సర్కార్ మద్యం ధరలను భారీగా పెంచింది. ఇక తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో దొరికే ఖరీదైన, బ్రాండెడ్ మద్యం ఏపీలో దొరకడం లేదన్న అపవాదు ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అమ్మే విస్కీ బ్రాండ్ ఒక దానిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.  వైసీపీ ప్రభుత్వం విస్కీ బ్రాండ్ కు ఈ రకమైన పేరు పెట్టి రాష్ట్రపతి పరువును తీస్తోందని.. కించపరుస్తోందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు జరుగుతున్నాయి.

ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా ఏపీలో అమ్మే ‘ప్రెసిడెంట్ మెడల్’ విస్కీకి వ్యతిరేకంగా కథనాలను వండి వారుస్తున్నాయి.

ఈ ప్రెసిడెంట్ మెడల్ విస్కీ బ్రాండ్ పేరు పాపం అంతా మాజీ సీఎం చంద్రబాబుదేనట.. ఎందుకంటే ఈ బ్రాండ్ పేరు విస్కీ విక్రయించడానికి గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సీజన్ 2019లోనే  చంద్రబాబు అనుమతులు ఇచ్చారు.

‘ప్రెసిడెంట్ మెడల్ విస్కీ కి సంబంధించి క్రెడిట్ ఏమైనప్పటికీ అది చంద్రబాబు ప్రభుత్వానికే దక్కాలి. ఎందుకంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ కొత్త మద్యం బ్రాండ్ కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు..ఇదే నిజం’ అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధారాలు కూడా బయటపెడుతున్నాడు.

సో ఈ ప్రెసిడెంట్ మెడల్ విస్కీ అనుమతి.. అమ్మకం.. ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్.. విమర్శలన్నీ చంద్రబాబుకే దక్కుతాయని వైసీపీ చెబుతోంది.
Tags:    

Similar News