మనసు దోచేసిన రాష్ట్రపతి.. వాహన సదుపాయం ఉన్నా 2 కి.మీ. నడిచారు

Update: 2022-11-10 12:36 GMT
మన దేశంలో అత్యున్నత పదవి ఏదైనా ఉందంటే.. అది భారత రాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడిగా వ్యవహరించే ఈ పదవికి రాజ్యాంగపరంగా అత్యుత్తమ స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. భారతంలో ఆ పదవిని చేపట్టిన వారిలో పలువురు ఆదర్శవంతులు.. స్ఫూర్తివంతులు ఉంటే.. మరికొందరు ఆ పదవిని ఎలా చేపట్టారన్న విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి.

అయితే.. రాష్ట్రపతి పదవి ఎంపిక ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ మైండ్ సెట్ ఆధారంగా ఎంపిక జరిగిందని చెప్పాలి. సమకాలీన భారతంలో అబ్దుల్ కలాం తర్వాత.. అంత సింపుల్ సిటీగా వ్యవహరించిన వ్యక్తులు.. అత్యుత్తమ స్థానంలో ఉండి కూడా సాదాసీదాగా ఉండటం.. జనం మధ్య ఉండాలని కోరుకోవటం.. ఆడంబరాలకు దూరంగా ఉండటం.. అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో దేశ రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ద్రౌపది ముర్ము భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

ప్రస్తుతం ఆమె ఒడిశాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె పూరీ జగన్నాథుడి సన్నిదికి వెళ్లారు. మరే రాష్ట్రపతి అయినా సరే.. గుడి ముందు వరకు భారీ కాన్వాయ్ తో రాజసంతో చేరుకొని.. అక్కడినుంచి స్వామి వారిని దర్శించుకొని.. తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లిపోవటం చూస్తుంటాం. అలా చేస్తే.. ఆమె ద్రౌపది ఎందుకు అవుతారు? నిజమే.. తాజాగా ఆమె తీరు కాస్త భిన్నంగా ఉంది.

జగన్నాథ స్వామి దర్శనం కోసం చాపర్ దిగిన ఆమె.. కాన్వాయ్ తో బయలుదేరకుండా.. అక్కడే ఆమె కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ ముందుకువెళ్లారు. అలా ఏకంగా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆలయానికి వెళ్లిన వైనం అందరిని ఆకర్షించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆమె నడిచిన రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. చాలా కాలం తర్వాత సాదాసీదాగా ఉండే రాష్ఱ్రపతి ఒకరు రావటం.. తన చేతలతో ఆమె ప్రజల మనసుల్ని దోచుకుంటున్నారని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News