కరోనా బారినపడ్డా అమెరికా అధ్యక్షుడు.. 70 ఏళ్లు దాటడంతో అప్రమత్తం?

Update: 2022-07-21 16:54 GMT
ఎన్ని టీకాలు వేసుకున్నా.. తిరిగి బూస్టర్ డోసులు వేసుకున్నా కూడా కరోనా వదలడం లేదు. కరోనా కల్లోలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఈ వైరస్ సోకింది. ఆయన నాలుగు రోజులకే రికవరీ అయ్యారు.ఇప్పుడు తాజా అధ్యక్షుడు జోబైడెన్ కు కూడా కరోనా సోకడం గమనార్హం.

అయితే జోబైడెన్ వయసు 70 ఏళ్లు దాటడంతో వైద్యులు ప్రత్యేక చికిత్సలు తీసుకుంటున్నారు. జోబైడెన్ ఇప్పటికే బూస్టర్ డోసులు కూడా తీసుకున్నాడు.

అయినా కూడా తాజాగా కరోనా వైరస్ బారినపడడం గమనార్హం.  ఈమేరకు గురువారం రాత్రి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

కరోనా బారినపడ్డ జోబైడెన్ కు స్వల్పంగానే వ్యాధి లక్షణాలు ఉన్నాయని వైట్ హౌస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపింది.

కరోనా నుంచి రక్షణ కోసం ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తోపాటు ఇటీవలే బూస్టర్ డోస్ ను కూడా జోబైడెన్ తీసుకున్నాడు. అయినా కూడా ఆయన కరోనా బారినపడడం కలకలం రేపుతోంది.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోనే జోబైడెన్ ఐసోలేషన్ లో ఉన్నాడు. తన అధికారిక విధులను అందులోంచే నిర్వర్తిస్తున్నారు.
Tags:    

Similar News