రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుల దినోత్సవానికి ఒక రోజు ముందే మాస్టారి అవతారమెత్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పాఠాలు బోధించారు. ఆయన ఎంచుకున్న సబ్జెక్టు కూడా చాలా ఆసక్తికరమైనదే కావడం విశేషం. భారతదేశ రాజకీయ చరిత్రను ఆయన విద్యార్థులకు బోధించగా వారంతా చెవులు రిక్కించి విన్నారట. అంతేకాదు ఆయన తన విద్యార్ధి దశలో చేసిన అల్లరిపనులనూ గుర్తుచేసుకున్నారట.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఇంటర్ మొదటి, రెండవ తరగతుల విద్యార్థులతో రాష్ట్రపతి ప్రణమ్ ముఖర్జీ ముఖాముఖి నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన వారికి భారత రాజకీయ చరిత్రను బోధించారు. ఉపాధ్యాయుల దినోత్సవ నేపథ్యంలో ఆయన ఒకరోజు ముందుగానే విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా తాను విద్యార్థిగా ఉన్నప్పటి కొన్ని విషయాలను కూడా ప్రణబ్ వారికి చెప్పారు. చిన్నప్పడు బడికి వెళ్లేందుకు తాను రోజుకు పది కిలోమీటర్లు నడిచేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు యూనిఫాంలు ఉండేవి కాదని, ఒక చేత్తో పుస్తకాలు, ఇంకోచేత్తో నడుంకు కట్టుకున్న టవల్ ను పట్టుకుని వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన సాధారణ విద్యార్థిని తానంటూ ఆయన తన చిన్ననాటి సంగతులను విద్యార్థులతో పంచుకున్నారు. చిన్నప్పుడు అల్లరిచేసేవాడినని... తల్లి వారించేదని చెప్పారు.