ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న తరుణం మరికొన్ని క్షణాల్లో రాబోతోంది. ఢిల్లీ లో నిర్భయ పై అత్యాచారం కేసులో ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా కూడా దోషులకు శిక్ష పడకపోవడంతో చాలామంది న్యాయస్థానాలపై నమ్మకం కూడా కోల్పోయారు. కానీ , న్యాయం ఇంకా బ్రతికేవుంది అని నిరూపిస్తూ ..తాజాగా వారికీ ఉరి శిక్షని అమలు చేయబోతున్నారు. నలుగురు దోషుల ఉరికి అన్ని సిద్ధం చేసారు. వీరికి ఉన్న న్యాయ - రాజ్యాంగపరమైన అవకాశాలన్నీ ముగిశాయి.
నేడు (సోమవారం ) పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయగా.. తాజాగా అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా తిరస్కరించారు. అలాగే డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీనితో నలుగురు దోషులు ముకేష్, పవన్ గుప్తా - వినయ్ - అక్షయ్ కు మంగళవారం ఉదయం తీహార్ జైలులో ఉరిశిక్షని అమలు చేయబోతున్నారు. ఉరి అమలుకు సంబంధించి జైలు అధికారులు ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు.
నిర్వ్హత్ దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను విడతలవారీగా వినియోగించుకొని .. ఇప్పటికే రెండు సార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడేలా చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్లకున్న అవకాశాలన్నీ ముగియడంతో మార్చి 3న తీహార్ జైల్లో వీరిని ఉరితీయనున్నారు.