తాను ఏదైనా ఫిక్స్ అయితే.. ఆ పని పూర్తి అయ్యేంతవరకూ దాని మీదే కూర్చుంటారన్న పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉంది. దీనికి తగ్గట్లే తాజాగా సరికొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి చేత రాజముద్ర వేయించుకోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
జోనల్ వ్యవస్థను కేంద్రం చేత ఓకే చేయించుకోవటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు దేశంలో మరెక్కడా లేని విధంగా 95శాతం స్థానికతకు పెద్ద పీట వేస్తూ తయారు చేసిన విధానాన్ని ఏ మాత్రం మార్చకుండా ఆమోదముద్ర వేయటం.. రాష్ట్రపతి సైతం రాజముద్ర వేసేయటం ఈ మొత్తం ఎపిసోడ్ కి హైలెట్ గా చెప్పాలి.
ప్రధాని ఓకే చేసిన జోనల్ వ్యవస్థకు సంబంధించిన పత్రాలపై బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాష్ట్రపతి కోవింద్ రాజముద్ర వేస్తూ సంతకం చేశారు. దీనికి సంబంధించిన గెజిట్ గురువారం విడుదలైంది. తాజా ఉత్తర్వులతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి రానుంది. తాజా జోనల్ విధానంతో ప్రయోజనం ఏమంటే.. 95 శాతం స్థానికులకు మాత్రమే విద్యా.. ఉద్యోగ విషయాల్లో లాభం జరగనుంది.
అంటే.. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్థానికత ఉన్న వారికి మాత్రమే పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. లేని వారికి ఇబ్బందులే. తాజాగా విడుదల చేసిన సరికొత్త జోనల్ వ్యవస్త తెలంగాణకు వర్తిస్తుందని.. వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. గతానికి భిన్నంగా తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త విధానంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ విద్యాభ్యాసంలో వరుసగా నాలుగేళ్లు చదివిన వారినే స్థానికులుగా గుర్తిస్తారు.
కొత్త విధానం అమల్లోకి రావటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1975 అక్టోబరు 18న జారీ అయిన జీఎస్ ఆర్ 524(ఇ) ఉత్తర్వులు రద్దైంది. కొత్త విధానంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు.. వాటికి సంబందించిన రెండు బహుళ జోన్లు అమల్లోకి రానున్నాయి. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలు జిల్లా జోన్.. బహుళ జోన్లకు పరిమితం చేస్తారు. ఇక.. రాష్ట్రస్థాయి ఉద్యోగాల్ని ప్రత్యక్ష పద్దతిలో ఎంపిక చేయటం ఉండదు. సర్వీసు ఆధారంగా వచ్చే ప్రమోషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే.. రానున్న రోజుల్లో స్థానికులకు పెద్దపీట వేస్తారు. నాన్ లోకల్స్ కు తెలంగాణ ప్రభుత్వ సర్వీసుల్లో ఎలాంటి ప్రాధాన్యత దక్కదు. ఒకవేళ దక్కినా అది చాలా.. చాలా పరిమితంగా ఉండనుంది.
కొత్త విధానంలో కీలకాంశాల్ని చూస్తే..
+ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి.
+ మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్ గా - మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్ గా పరిగణిస్తారు.
+ ఉద్యోగాలను జిల్లా - జోనల్ - బహుళ జోన్ - రాష్ట్రస్థాయి కేడర్లుగా పరిగణిస్తారు.
+ మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.
+ రాష్ట్రస్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలుండవు. పదోన్నతుల ద్వారా నియమిస్తారు.
+ ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా కేడర్‌లో 80:20 - జోనల్ కేడర్‌లో 70:30 - బహుళ జోనల్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక (లోకల్) - స్థానికేతర (నాన్ లోకల్) రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
+ ఇప్పటివరకూ రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. అందరూ వీటికి పోటీపడేవారు.
+ కొత్త విధానంలో ఈ విధానాన్ని మార్చేశారు. రాష్ట్ర కేడర్ పోస్టులను ప్రత్యక్ష నియామకాలను పూర్తిగా నిలిపేశారు
+ ప్రభుత్వశాఖల్లోని వాటిని కేవలం పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.
+ జిల్లా - జోనల్ - బహుళ జోనల్ పరిధిలో మాత్రమే ప్రత్యక్ష నియామకాలు ఉంటాయి. వాటికి 95శాతం స్థానిక రిజర్వేషన్లు - 5శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఇస్తారు.
+ ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్ల పాటు చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు.
+ రాష్ట్రస్థాయిలోనే కాదు.. జిల్లా - జోన్లు - బహుళ జోన్ల పరిధిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు.
రిజర్వేషన్లు ఎలా ఉంటాయంటే..
= అన్ని జిల్లా - జోనల్ - బహుళ జోనల్ పోస్టులకు 95% స్థానిక రిజర్వేషన్లు ఉంటాయి. నియామకాల్లో కనీసం ఒక పోస్టు అయినా స్థానికేతరులకు ఉండేలా చూడాలి. ఎస్సీ - ఎస్టీ - బీసీ రిజర్వేషన్ల మీద దీని ప్రభావం ఉండదు.
రిజర్వేష్లనకు మినహాయింపులు ఏమంటే?
= కొత్త జోనల్ విధానంలోని నిబంధనలు రాష్ట్ర సచివాలయం - శాఖాధిపతి కార్యాలయం - రాష్ట్రస్థాయి కార్యాలయం - సంస్థ - ప్రత్యేక సంస్థ - కార్యాలయాల్లోని పోస్టులకు వర్తించవు. అయితే జోనల్ విధానంలో మినహాయించిన కార్యాలయాల్లోని పోస్టుల నుంచి ఉద్యోగులను జోనల్ విధానం అమలయ్యే కార్యాలయాలకు బదిలీ చేయవచ్చు.