మహారాష్ట్రలో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన!

Update: 2019-11-12 12:49 GMT
మహా రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త మలుపు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగియడం , వాటి ఫలితాలు రావడం చకచకా జరిగిపోయాయి. కానీ , ఆ తరువాత మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులతో కొనసాగుతోంది. శివసేన - బీజేపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో  మహా రాష్ట్ర లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో 20 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఇంతలోనే మహారాష్ట్ర  అసెంబ్లీ కాలం ముగియడం తో సీఎం రాజీనామా చేసారు. దీనితో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ బీజేపీ , శివసేన , ఎన్సీపీ పార్టీలని ఆహ్వానించారు. కానీ , ఏ పార్టీ కి కూడా పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి.  గవర్నర్ విధించిన గడువు లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో మహా రాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.

ఇకపోతే  తాజాగా జరిగిన ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ నుండి  54 మంది.  కాంగ్రెస్ పార్టీ  నుండి 44 మంది ఎమ్మెల్యే లు విజయం సాధించారు.  మహా రాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అంటూ తెలిపింది. కానీ , శివసేన .. కాంగ్రెస్ , ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్సీపీ  కి గవర్నర్ ఇచ్చిన సమయం ఈ రోజు రాత్రి  8.30గంటల వరకు ఉంది. కానీ, ఆ గడువు ముగియక ముందే మహా రాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు గవర్నర్ కోశ్యారీ. ఆయన సిఫార్సు అందిన వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశ మై ఆమోదించింది. అటు కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం ఆమోదించడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 
Tags:    

Similar News