రాష్ట్రపతి రేసులో నిలిచిన కాంగ్రెస్ కమ్ విపక్షాల అభ్యర్థి.. మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఫ్లైట్ మిస్ అయ్యింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం హైదరాబాద్ వచ్చిన ఆమె.. తన తిరుగు ప్రయాణంలో శంషాబాద్ కు షెడ్యూల్ టైంకు తిరిగి చేరుకోలేకపోయారు. దీంతో.. ఆమె ప్లైట్ మిస్ అయ్యింది.
హైదరాబాద్ లో ప్రచారం ముగించుకున్న ఆమె.. ఇండిగో విమానంలో అహ్మాదాబాద్ కు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆలస్యంగా ఎయిర్ పోర్ట్ కు రావటంతో విమానం వెళ్లిపోయింది. దీంతో.. ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉండిపోయారు. దాదాపు మూడు గంటలుగా (రాత్రి ఏడున్నర గంటల సమయానికి) ఆమె ఎయిర్ పోర్ట్ లో విమానం కోసం వెయిట్ చేస్తుండటం గమనార్హం.
కోల్ కతా మీదుగా వెళ్లే విమానంలో ఆమెను పంపటానికి వీలుగా ఎయిర్ లైన్స్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు ఎయిర్ పోర్ట్ కు ఆలస్యంగా చేరుకున్నా.. బోర్డింగ్ పాస్ లకు సమయం దాటినా జులుం చేస్తున్న ఉదంతాలు బయటకు వస్తున్న వేళ.. రాష్ట్రపతి రేసులో ఉన్న అభ్యర్థి ప్రయాణించాల్సిన విమానం మాత్రం వెళ్లిపోవటం చూసినప్పుడు.. పవర్ మహిమ ఏమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/