రాష్ట్రపతి ఎన్నిక : టీయారెస్ ఓటు ఎవరికంటే...?

Update: 2022-06-21 15:11 GMT
దేశానికి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడం కోసం జూలై 18న ఎన్నిక జరగనుంది. అటు అధికార ఎన్డీయే, ఇటు విపక్ష శిబిరాలు రెండూ పోటా పోటీగా ఢీ కొట్టనున్నాయి. ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో రెండు శిబిరాలకు దాదాపుగా సమానంగా ఓట్లు ఉన్నాయి.

ఇక అటు ఎన్డీయేకు ఇటూ యూపీయేకు చెందిన పక్షాలే  కీలకంగా ఉన్న ఈ ఎన్నికలలో  ప్రాంతీయ పార్టీల వైపే అందరి చూపూ ఉంది.

అలా చూస్తే కనుక  టీయారెస్ కూడా ముఖ్య పాత్ర పోషించనుంది.  మిగిలిన పార్టీలలొ  అధికార ఎన్డీయేకు వైసీపీ అన్నాడీఎంకే, బిజూ జనతాదళ్ మద్దతుతోనే మెజారిటీ వస్తుంది అని అంచనా

అయితే గతసారి బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చిన టీయారెస్ ఈసారి ఏం చేస్తుంది అన్న చర్చ ఉంది. ఈ నేపధ్యంలోనే విపక్ష శిబిరం దూకుడు పెంచింది. ఎన్డీయే కంటే ముందే తమ ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించింది.

దిగ్గజ నేత శరద్ పవార్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్నుకున్నారు. ఆ సమావేశం నుంచే శరద్ పవార్ నేరుగా కేసీయార్ తో మాట్లాడి సిన్హా అభ్యర్ధిత్వానికి మద్దతు కూడగట్టారని సమాచారం.

ఇక టీయారెస్ ఆలోచనలు కూడా చూస్తే ఆయన బీజేపీకి కాంగ్రెస్  కి సమదూరం పాటించాలని భావిస్తున్నారు. దాంతో ఆ రెండు పార్టీలకు చెందిన యశ్వంత్ సిన్హా అభ్యర్ధిత్వానికి కేసీయార్ జై కొడుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కేసీయార్ న్యూట్రల్ విధానం ఇలా సక్సెస్ అయింది అని అంటున్నారు.
Tags:    

Similar News