రాష్ట్రప‌తి ఎన్నిక‌లో గులాబీ రంగు స్పెష‌ల్‌

Update: 2017-07-16 09:43 GMT
 నూత‌న రాష్ట్ర‌ప‌తి కోసం సోమ‌వారం ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక గురించి రాజ‌కీయ‌వ‌ర్గాలు త‌మ విశ్లేష‌ణ‌లు మొద‌లుపెట్టాయి. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన బ్యాలెట్ పేప‌ర్‌ లో మొద‌టి పేరు మీరా కుమార్‌ దే ఉంటుంది. ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్‌ నాథ్ కోవింద్‌ కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నా మీరా కుమార్ పేరు బ్యాలెట్‌ లో మొద‌ట ఉందని అప్పుడే మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ఉత్ప‌ల్ కుమార్ సింగ్‌, కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ఈవీఎస్ఎన్ ప్ర‌సాద్‌లు ఈ ఎన్నిక‌ల‌కు అబ్జ‌ర్వ‌ర్లుగా ఉంటారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వీరిని నియ‌మించింది. ఈ ఎన్నిక కోసం బ్యాలెట్ పేరును రంగుల్లో ముద్రించారు. ఎంపీల కోసం గ్రీన్ క‌ల‌ర్ బ్యాలెట్‌ను వాడుతారు. ఎమ్మెల్యేల బ్యాలెట్ పేప‌ర్ పింక్ క‌ల‌ర్‌లో ఉంటుంది. అయితే త‌మ ఓటును వేసేందుకు ఓట‌ర్ల‌కు వాయిలెట్ రంగు ఇంక్‌ను ఇస్తారు. టిక్ మార్క్‌తో తమ ఓటును ఓట‌ర్లు వినియోగించుకోవాలి. మ‌రేదైనా వేరే రంగు పెన్‌తో బ్యాలెట్‌పై మార్క్ చేస్తే, ఆ ఓటు చెల్ల‌దు.

జూలై 17న ఎన్నిక జ‌రిగితే, జూలై 25న కొత్త రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో ఎంపీలు - ఎమ్మెల్యేలు ఓటేస్తారు. ఢిల్లీలో ఉన్న పార్ల‌మెంట్ హౌజ్‌ లోని రూమ్ నెంబ‌ర్ 62లో ఓటింగ్ జ‌రుగుతుంది. ఇక్క‌డ ఎంపీలు ఓటేస్తారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ - కాంగ్రెస్ నేత‌లు సోనియా - రాహుల్ గాంధీలు అదే రూమ్‌ లో ఉన్న టేబుల్ నెంబ‌ర్ 6 నుంచి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు. ఢిల్లీలో ఓటు వేయాల‌నుకున్న ఎమ్మెల్యేలు ముందు ఎన్నిక‌ల సంఘం నుంచి ప‌ర్మిష‌న్ తీసుకోవాలి. గుజ‌రాత్‌కు చెందిన ఎమ్మెల్యే - బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా త‌న ఓటును ఢిల్లీలోనే వినియోగించుకోనున్నారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కౌంటింగ్ జూలై 20న జ‌రుగుతుంది. పార్ల‌మెంట్‌ లోని రూమ్ నెంబ‌ర్ 62లోనే ఈ కౌంటింగ్ జ‌రుగుతుంది. ఆయా రాష్ట్రాలు కూడా ఆ రోజునే కౌంటింగ్ నిర్వహిస్తాయి. జూలై 23న ప్ర‌ణ‌బ్ వీడ్కోలు ఉంటాయి. పార్ల‌మెంట్ స‌భ్యులు సెంట్ర‌ల్ హాల్‌ లో ఫేర్‌ వెల్ సెర్మ‌నీ ఏర్పాటు చేస్తారు. జూలై 25న ప్రెసిడెంట్ గుర్ర‌పు బండి రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన వ్య‌క్తి నివాసానికి చేరుకుంటుంది. ఎన్నికైన అభ్య‌ర్థి బ‌గ్గీలో పార్ల‌మెంట్ హాల్‌ కు చేరుకుంటారు. అక్క‌డే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కొత్త రాష్ట్ర‌ప‌తి చేత ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. ప్ర‌ణ‌బ్ కూడా ఈ ఈవెంట్‌ లో పాల్గొంటారు. ఆ త‌ర్వాత కొత్త రాష్ట్ర‌ప‌తి రాజాజీ మార్గ్‌ లో ఉన్న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ కు చేరుకుంటారు.
Tags:    

Similar News