వైసీపీ ఎంపీకి షాకిచ్చిన మీడియా విలేక‌రులు.. ఏం జ‌రిగిందంటే!

Update: 2022-10-20 15:05 GMT
రాష్ట్రంలో ఏం చేసినా.. త‌మ‌కు మాత్ర‌మే చెల్లుంద‌ని భావించే వైసీపీ నాయ‌కులు.. చాలా మంది క‌నిపిస్తున్నారు. త‌ప్పులు చేయ‌డం.. పొరుగు వారిపై నెట్టేయ‌డం.. వారికి ప‌రిపాటిగా మారిపోయింది. అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు క‌దా.. ఎప్పుడో ఒక‌ప్పుడు అవి బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి.

పడ‌తాయి కూడా! ఇప్పుడు రాజ‌మండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ విష‌యంలోనూ.. చేసిన త‌ప్పులు బ‌య‌ట ప‌డ్డాయి. అవి కూడా.. ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. త‌న త‌ప్పుల‌ను ఎదుటి వ‌ర్గంపై నెట్టాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడే కావ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగిందంటే..

రెండు రోజుల కింద‌ట‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు చేస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 రాజ‌మండ్రిలోకి ప్ర‌వేశించింది. అయితే.. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తిస్తున్న వైసీపీ నాయ‌కులు.. వీరిని అడ్డగించే ప్ర‌య‌త్నం చేశారు. తొలిరోజే.. ఇక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. అయినా.. రైతులు ధైర్యంగానే ముందుకు సాగారు. మ‌రుస‌టిరోజు మాత్రం ఏకంగా.. ఎంపీ మార్గాని రంగంలోకి దిగేశారు. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లోని త‌న అనుచ‌రుల‌తో దూసుకువ‌చ్చారు. వారికి వ్య‌తిరేకంగా.. నినాదాలు చేశారు. ఏకంగా.. వాట‌ర్ బాటిళ్ల‌ను కూడా.. విసిరి.. మ‌హిళ‌లు అని కూడా.. చూడ‌కుండా.. దాడులు చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. రైతులు కూడా.. ఇదే చెప్పారు.

అయితే.. ఈ క్ర‌మంలో త‌మ‌పైనే రైతులు దాడులు చేశార‌ని.. వైసీపీ నాయ‌కులు పేర్కొన్నారు. అంటే.. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు చేస్తున్న స‌మ‌యంలో రైతులే త‌మ‌పై వాట‌ర్ బాటిళ్లు విసిరేశార‌ని.. వారు పేర్కొన్నారు. ఇలా.. ఎదురుది కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో ఎంపీ మార్గాని.. తాజాగా మీడియా మీటింగ్ పెట్టి.. అప్పుడు అస‌లు ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో త‌మ‌వైపు ఉన్న మీడియా మిత్రులు కూడా.. రైతులు విసిరిన బాటిళ్లు.. వాట‌ర్ ప్యాకెట్ల కార‌ణంగా.. గాయ‌ప‌డ్డార‌ని.. అన్నారు.

అయితే.. ఇంత‌లో అక్క‌డ ఉన్న ఒక విలేక‌రి మాత్రం.. ``కాదు స‌ర్‌.. వైసీపీ వాళ్లు విసిరిన బాటిళ్లే మాకు త‌గిలాయి`` అని చెప్పారు. రైతులు కేవ‌లం.. ప్యాకెట్లు మాత్ర‌మే వేశార‌ని.. వైసీపీవాళ్లు బాటిళ్ల‌ను విసిరేశార‌ని.. అవే త‌మ‌కు వ‌చ్చి త‌గిలాయ‌ని చెప్పారు. దీంతో.. ఎంపీ మార్గాని ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

ఎందుకంటే..అప్ప‌టి వ‌ర‌కు రైతుల పై ఎదురు దాడి చేస్తూ.. త‌ప్పువారిపై నెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం.. దానికి విలేక‌రులు.. కాద‌ని సాక్షం చెప్ప‌డంతో ఆయ‌న ఆగ్ర‌హానికి గురై.. ఆ వెధ‌వ‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతావేంటి.? అని ప్ర‌శ్నిస్తూ.. అర్ధంత‌రంగా.. మీడియా స‌మావేశాన్ని ముగించేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News