షాకింగ్: 'హెచ్ 1బీ' ల‌ను నిషేధించాల‌ట‌!

Update: 2018-08-21 08:44 GMT
2014లో అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ ప్ర‌జ‌ల్లో లోకల్ సెంటిమెంట్ మ‌రింత బ‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా నాన్ అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు లేకుండా చేయాల‌ని....అక్క‌డి ఉద్యోగాల‌న్నీ లోక‌ల్ అమెరిక‌న్ల‌కే రావాల‌ని ట్రంప్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే హెచ్-1బీ వీసాల జారీ ప్ర‌క్రియ‌లో ప‌లు నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తూ వ‌చ్చారు. కొద్ది రోజుల క్రితం ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌కు మ‌రిన్ని విచ‌క్ష‌ణాధికారాల‌ను క‌ల్పిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హెచ్ 1 బీ వీసాల‌పై ఉద్యోగాలు చేసే భార‌తీయుల‌పై యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్(యూఎస్ సీఐఎస్) డైరెక్ట‌ర్ ఎల్ ఫ్రాన్సిస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హెచ్ 1 బీ వీసాతో అమెరికన్ల స్థానంలో భార‌తీయులు ఉద్యోగాలు చేప‌ట్ట‌కుండా నిషేధం విధిస్తే తాను చాలా సంతోషిస్తాన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్ర‌కారం అమెరిక‌న్ కాంగ్రెస్ ఒక బిల్లు జారీ చేస్తే ఇంకా ఆనందిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ బిల్లును త‌క్ష‌ణ‌మే తానే స్వ‌యంగా రూపొందించాల‌ని ఉంద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

కొద్ది రోజుల క్రితం హెచ్ 1బీ వీసాల జారీ విష‌యంలో యూఎస్ సీఐఎస్ అధికారుల‌కు పూర్తి అధికారాల‌ను ఇస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆదేశాల ప్ర‌కారం.... ఇక‌పై హెచ్ 1బీ వీసాలు - పిటిష‌న్లు - విజ్ఞ‌ప్తుల‌ను త‌క్ష‌ణం తిర‌స్క‌రించే అధికారం యూఎస్ సీఐఎస్ అధికారుల‌కు ఉంటుంది. ఆ అధికారాలు ఈ ఏడాది సెప్టెంబ‌రు 11 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. వాస్త‌వానికి - గ‌తంలో హెచ్ 1బీ వీసాల ద‌ర‌ఖాస్తులో లోపాలు - త‌ప్పులు ఉంటే వాటిని స‌వ‌రించుకునేందుకు రిక్వెస్ట్ ఫ‌ర్ ఎవిడెన్స్(ఆర్ ఎఫ్ ఈ) లేదా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై(ఎన్ ఓఐడీ)ను ఇమ్మిగ్రేష‌న్ అధికారులు జారీ చేసేవారు. ఆ త‌ర్వాత పూర్తి వివ‌రాల‌తో స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తును ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవారు. అయితే, తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం....హెచ్ 1బీ వీసాల‌ను ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ఆర్ ఎఫ్ ఈ - ఎన్ ఓఐడీ జారీ చేయ‌కుండానే తిర‌స్క‌రించ‌వ‌చ్చు. ఇటువంటి నేప‌థ్యంలో ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్య‌లు....అమెరికాలో నివ‌సించే భార‌తీయుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.
Tags:    

Similar News